KGF Chapter 3 : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో సినీ ప్రియులు బాహుబలి సిరీస్ తర్వాత ఎక్కువగా ఎగబడి చూసిన సిరీస్ ‘కేజీఎఫ్’..అతి తక్కువ బడ్జెట్ తో కన్నడలో తెరకెక్కిన ఈ సిరీస్ పార్ట్ 1 తెలుగు, కన్నడ , తమిళం, హిందీ మరియు మలయాళం బాషలలో ప్రభంజనం సృష్టించింది..ఆ తర్వాత చాప్టర్ 2 ని తీశారు..ఈ చిత్రం కోసం సినీ అభిమానులు ఎంతలా ఎదురు చూసారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

విడుదల తర్వాత ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు..దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR సినిమా వసూళ్లను సైతం ఈ చిత్రం దాటేసింది అంటే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టో అర్థం చేసుకోవచ్చు..అయితే చాప్టర్ 2 లో హీరో క్లైమాక్స్ లో చనిపోయినట్టు చూపిస్తాడు..కానీ రోలింగ్ టైటిల్స్ చివర్లో చాప్టర్ 3 కూడా ఉంది అని ప్రేక్షకులకు ఫ్యూజులు ఎగిరిపోయ్యే రేంజ్ ట్విస్ట్ ఇస్తాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.
అయితే చాప్టర్ 3 షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది..?, అసలు పార్ట్ 3 నిజంగానే ఉందా, లేదా ఊరికే ఆలా చెప్పారా అనే సందేహాలు ప్రతీ ఒక్కరిలో నెలకొన్నాయి..అయితే ఈ చిత్రాన్ని నిర్మించిన హోమబుల్ సంస్థ పార్ట్ 3 కచ్చితంగా ఉంటుంది అని అధికారికంగా ఇటీవలే ప్రకటించారు.
కానీ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ మరియు ఎన్టీఆర్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్..ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాతే KGF చాప్టర్ 3 ఉంటుందని ఈరోజు జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు..అంటే 2024 చివర్లో , లేదా 2025 ప్రథమార్థం లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి అన్నమాట..మరి KGF ఫ్యాన్స్ పార్ట్ 3 కోసం రెండేళ్లపాటు ఎదురు చూడాల్సిందే.