
Simran: సినిమాకు అందాన్నిచ్చేది హీరోయిన్లు మాత్రమే. వీళ్లు గ్లామర్ తోనే కొన్ని సినిమాలు బాగా ఆడాయి. అందుకే సినిమాల్లోకి రావాలనుకున్నవారు బ్యూటీనెస్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అందంగా మారేందుకు రకరకాల సర్జరీలు చేయించుకుంటారు. ఎలాంటి మేకప్, సర్జరీలు లేకుండా ఓ స్టార్ హీరోయిన్ సినిమాల్లో నాచురాలిటీ అందంతో ఆకట్టుకున్నారు. స్టార్ హీరోల పక్కన నటించి మెప్పించారు. ఒక దశలో ఆ హీరోయిన్ డేట్స్ కోసం కోందరు హీరోలు వెయిట్ చేయాల్సి వచ్చింది. అయితే కొంతకాలం గడిచాక ఈమె పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా మారింది. అయితే ఇటీవల ఇమెకు సంబంధించిన పిక్ వైరల్ అవుతోంది. ఇందులో ఆమె సాంప్రదాయ దుస్తుల్లో గుర్తుపట్టలేని విధంగా కనిపిస్తున్నారు. ఇంతకీ ఆ స్టార్ నటి ఎవరో చూడండి.
1979 ఏప్రిల్ 4న ముంబైలో జన్మించారు సిమ్రన్. వీరిది పంజాబీ కుటుంబం. ముంబైలో చదువు పూర్తయిన తరువాత మోడలింగ్ లో అడుగుపెట్టిన ఈమె హిందీలో ‘సనమ్ హర్ జాయె’ అనే చిత్రం ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ‘తెరె మేరే సప్నే’ అనే సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. సౌత్ విషయానికొస్తే మలయాళంలో మొదటిసారి ఈమె ‘ఇంద్రప్రస్థం’ సినిమా ద్వారా అడుగుపెట్టింది.
తెలుగులో ‘మా నాన్నకి పెళ్లి’ సినిమా త్వారా ప్రేక్షకులను పరిచయమై.. ఆ తరువాత కొద్ది కాలంలోనే చిరంజీవి, వెంకటేస్, నాగార్జున, బాలకృష్ణ అందరి హీరోల పక్కన నటించింది. తెలుగు, తమిళం, మలయాళం బాషలతో సంబంధం లేకుండా ప్రతి స్టార్ హీరోతో సిమ్రన్ నటించడం విశేషం. కొన్నాళ్ల పాటు హవా సాగించిన ఈమె ఆ తరువాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.

2003న సిమ్రన్ తన చిన్ననాటి స్నేహితుడు దీపక్ బగ్గాను డిసెంబర్ 23న పెల్లి చేసుకుంది. ఆ తరువాత వీళ్లు అమెరికాలో సెటిలైపోయారు. వీరికి అదిప్ ఓదో, ఆడిత్ వీర్ అనే కుమారులు ఉన్నారు. అమెరికాలో ఉన్న సిమ్రన్ భారతీయ సంప్రదాయాలను ఎక్కువగా గౌరవిస్తారు. ఇటీవల ఓ ఫెస్టివ్ సందర్భంగా తన భర్త, కుమారులతో కలిసి దిగిన ఓ ఫొటోబయటకు వచ్చింది. ఇందులో సిమ్రన్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు.
పంజాబీ సాంప్రదాయంలో సాంప్రదాయ చీరకట్టులో ముక్కెర పెట్టుకొని, చెవులకు భారీ రింగులు తగిలించారు. అలాగే కొప్పును కరూడా సాంప్రదాయంగా తీర్చిదిద్దారు. ఇప్పటివ రకకాల ఫొటోలతో దర్శనమిచ్చిన సిమ్రన్ ఒక్కసారిగా ఇలా సాంప్రదాయ లుక్స్ లో కనిపించేసరికి అంతా షాక్ అవుతున్నారు. కొందరు సిమ్రన్ కొత్త రూపం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.