Figs: మనకు ఆరోగ్యం ప్రసాదించడంలో పండ్ల పాత్ర ముఖ్యమైనది. పండ్లు సహజసిద్ధంగా లభించడంతో అందులో ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పోషకాలు మెండుగా ఉండటంతో పండ్లు మనం ఎక్కువగా తీసకుంటే ప్రయోజనాలే కలుగుతాయి. అంజీర పండ్లలో ఎన్నో సహజ గుణాలుంటాయి. వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. చలికాలంలో వీటిని తినడం వల్ల ఎన్నో రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందొచ్చు. వీటిని అతిగా తింటే మాత్రం కడుపుకు సంబంధించిన సమస్యలు వస్తాయి.

అంజీర్ పండ్లలో విటమిన్లు, ఫైబర్, ప్రొటీన్లు, పొటాషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నిషియం, కాల్షియం, భాస్వరం వంటి పోషకాలు ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలను బలోపేతం చేస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. అత్తిపండ్లలో ఆక్సలేట్ ఉండటం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకుంటే రాళ్ల ముప్పు ఉంటుంది. మూత్ర పిండాల్లో రాళ్లు ఉన్న వారు వీటిని తీసుకోకపోవడమే ఉత్తమం.
అంజీర్ పండ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఎక్కువగా తింటే జీర్ణసంబంధమైన సమస్యలు ఎక్కువవుతాయి. అత్తి పండ్ల వల్ల కడుపులో బరువు పెరుగుతుంది. ఫలితంగా కడుపు నొప్పి వస్తుంది. ఈ పండ్లు మోతాదు మించి తింటే కాలేయం, పేగులకు చెడు చేస్తాయి. ఇందులో సల్ఫైట్ ఉంటుంది. దీంతో మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. ఇది ఉన్న వారు కూడా వీటిని తీసుకోవద్దు. ఇందులో ఉండే కార్బోహైడ్రేడ్లతో దంతాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. దంతాలు పుచ్చిపోయే అవకాశం ఉంది.

అంజీర పండ్లతో మంచి, చెడు రెండు ఉండటంతో శారీరక ఇబ్బందులు ఉన్న వారు వాటిని తీసుకోవడం ఇబ్బంది కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో ఇతర సమస్యలు లేని వారు మాత్రమే అంజీర పండ్లు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కీడు చేసే వాటికి దూరంగా ఉండి అవసరమైన వారు మాత్రమే వీటిని తీసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పండ్లు మనకు ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తున్నా అంజీర్ పండ్లు మాత్రం కొన్ని ప్రయోజనాలు కొన్ని నష్టాలు కూడా ఇవ్వడం సహజం.