Shweta Basu Prasad: సెన్సేషనల్ లవ్ డ్రామాలు అరుదుగా వస్తాయి. వాటిలో కొత్త బంగారు లోకం ఒకటి. టీనేజ్ లో పుట్టే మొదటి ప్రేమ తాలూకు ఆనవాళ్లు తట్టిలేపిన చిత్రం అది. ప్రేమ కథకు అందమైన ఫ్యామిలీ డ్రామా, సందేశం జోడించి శ్రీకాంత్ అడ్డాలా గొప్పగా తెరకెక్కించారు. కొత్త బంగారు లోకం చిత్రానికి ఆయన రాసిన డైలాగ్స్ నేరుగా గుండెలకు తాకుతాయి. నిజ జీవితాలకు దగ్గరగా ఉంటాయి. వరుణ్ సందేశ్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చిన చిత్రం. ఇక శ్వేతా బసు ప్రసాద్ చాలా రోజులు వెంటాడిన జ్ఞాపకం. 17ఏళ్ల వయసులో ప్రేమలో పడిన అమ్మాయి చేష్టలు, మాటలు ఎలా ఉంటాయో శ్రీకాంత్ అడ్డాలా బాగా రాసుకున్నారు.
ఆయన సృజనకు బిపాసా బసు నటన చాలా సహజంగా సాగింది. 2008లో విడుదలైన కొత్త బంగారు లోకం బ్లాక్ బస్టర్ హిట్. కానీ శ్వేతా బసు కెరీర్ అట్టర్ ప్లాప్. హీరోయిన్ గా రాణించాలంటే టాలెంట్ కి మించి అదృష్టం అవసరమని చెప్పడానికి బిపాసా బసు కెరీర్ నిదర్శనం. కొత్త బంగారు లోకం చిత్రంతో వచ్చిన ఫేమ్ ఆమెకు ఆఫర్స్ తెచ్చిపెట్టింది. అయితే వరుస పరాజయాలతో ఆమె గ్రాఫ్ పడిపోతూ వచ్చింది.
రైడ్, కాస్కో, కళావర్ కింగ్… వరుసగా ప్లాప్ అయ్యాయి. చిన్నా చితకా ఆఫర్స్ వస్తున్నా… కెరీర్ ని నిలబెట్టలేకపోయాయి. సినిమా ఆఫర్స్ తగ్గిన తరుణంలో బిపాసా వ్యభిచారం ఆరోపణలు ఎదుర్కొన్నారు. సెక్స్ రాకెట్ లో పట్టుబడ్డారంటూ వార్తలు వచ్చాయి. రెండు సార్లు ఆమె ఈ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇదంతా తనపై జరిగిన కుట్రగా బిపాసా బసు వివరణ ఇచ్చారు. వ్యక్తిగత జీవితంలో కూడా ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. 2018లో ఫిలిం మేకర్స్ రోహిత్ మిట్టల్ ని వివాహం చేసుకున్నారు. ఏడాదిలోపే ఆమె విడాకులు ప్రకటించారు.
శరీరంపై ఫోకస్ తగ్గడంతో లావయ్యారు. కాగా ఆమె లేటెస్ట్ లుక్ షాక్ ఇస్తుంది. హోమ్లీ లుక్ లో కనిపించే బిపాసా అల్ట్రా స్టైలిష్ అవతార్ లో మైండ్ బ్లాక్ చేశారు. ఆమె మేకోవర్ గుర్తుపట్టలేనంతగా ఉంది. అసలు ఈమె కొత్త బంగారు లోకం హీరోయినేనా అన్నంతగా ఛేంజ్ అయ్యారు. బరువు తగ్గడంతో పాటు ఆమె ఫేస్ మారిపోయింది. ప్రస్తుతం బిపాసా డిజిటల్ చిత్రాలు, సిరీస్లు ఎక్కువగా చేస్తున్నారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే బిపాసా నేషనల్ అవార్డు విన్నర్. చైల్డ్ ఆర్ట్స్ గా ఆమె ఈ అరుదైన ఘనత అందుకున్నారు.