https://oktelugu.com/

Ram Setu: రామసేతు: సముద్ర గర్భంలో పెట్టని కోట

Ram Setu: సేతుసముద్రం… ఆధునిక భారత చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన ప్రాజెక్టు.. రామసేతు మానవ నిర్మితమని, కాదు కాదు అది దేవుడు నిర్మించిందని అప్పట్లో పెద్ద ఎత్తున గొడవలు చెలరేగాయి.. ఈ రామసేతుపై అప్పట్లో అమెరికాకు చెందిన మూడు విశ్వవిద్యాలయాల భూగర్భ శాస్త్ర నిపుణులు అధ్యయనం చేశారు.. దీనిని డిస్కవరీ ఛానల్ ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో రామసేతు ను కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా కదిలించే సాహసం చేయలేకపోయింది.. అంతేకాదు పేరుకు మూడు దిక్కులా […]

Written By:
  • Rocky
  • , Updated On : January 13, 2023 / 03:47 PM IST
    Follow us on

    Ram Setu: సేతుసముద్రం… ఆధునిక భారత చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన ప్రాజెక్టు.. రామసేతు మానవ నిర్మితమని, కాదు కాదు అది దేవుడు నిర్మించిందని అప్పట్లో పెద్ద ఎత్తున గొడవలు చెలరేగాయి.. ఈ రామసేతుపై అప్పట్లో అమెరికాకు చెందిన మూడు విశ్వవిద్యాలయాల భూగర్భ శాస్త్ర నిపుణులు అధ్యయనం చేశారు.. దీనిని డిస్కవరీ ఛానల్ ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో రామసేతు ను కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా కదిలించే సాహసం చేయలేకపోయింది.. అంతేకాదు పేరుకు మూడు దిక్కులా సముద్రం ఉన్నప్పటికీ… తూర్పు, పశ్చిమ తీరాలకు ఒక వైపు నుంచి రెండోవైపు సముద్ర యానం చేయాలన్నా, సముద్రం ద్వారా సరుకు రవాణా చేయాలన్నా తీరం చుట్టూ నౌకలు వెళ్లలేవు.. శ్రీలంక చుట్టి రావాల్సిందే.. దీనికి రెండు కారణాలు ఉన్నాయి.. మొదటిది మన్నార్ అగాథం, రెండోది పాక్ జలసందుల్లో సముద్రంలోతు చాలా తక్కువగా ఉండడం.. దీనివల్ల ఓడలు సహజంగా ప్రయాణం చేసేందుకు వీలుపడదు.. దీనికి ప్రత్యామ్నాయంగా తవ్వకాలు జరిపి కృత్రిమంగా అక్కడ లోతు పెంచాలి.. చానల్ తవ్వాలంటే అడ్డుగా ఉన్న రామసేతును కచ్చితంగా కూల్చాలి.. ఒకవేళ ఇది జరిగితే మెజారిటీ ప్రజల మనోభావాలు గాయపడతాయి.. అందుకే 200 సంవత్సరాలుగా రామసేతువును ముట్టుకునే ప్రయత్నాలు విజయవంతం కావడం లేదు.

    Ram Setu

    ఆ చరిత్ర ఇప్పటిది కాదు

    రామసేతువుకు సంబంధించిన చరిత్ర ఇప్పటిది కాదు.. త్రేతా యుగంలో సీతమ్మను లంకలో ఉన్న రావణుడి చెర నుంచి విడిపించేందుకు రాముడు ఈ వారధి నిర్మించాడని అనేక పురాణాలు చెబుతున్నాయి.. కొన్ని వేల సంవత్సరాలైనా ఈ వారధి ఇంకా చెక్కుచెదరకపోవడం గమనార్హం.. గూగుల్ శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం ప్రపంచానికి తెలిసింది..ఆ చిత్రాల్లో రామసేతు కూడా చాలా స్పష్టంగా కనిపించింది.. ఇది ధనుష్కోటి ద్వీపం నుంచి లంకకు వేసిన కాలిబాట అని పలువురు చరిత్రకారులు చెబుతున్నారు.. అసలు ఆ కాలంలోనే నీటిపై తేలే ఇటుకలను ఎలా కనిపెట్టారో ఇప్పటికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది.. లక్షల సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఇటుకలు చెక్కుచెదరకపోవడం గమనార్హం.. ఇంతటి సాంస్కృతిక వైవిధ్యం ఉన్న వారధిని కేవలం రవాణా ఖర్చు కలసి వస్తుంది, వ్యాపారం వృద్ధి చెందుతుంది అనే తలంపుతో గతంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా కారణాన్నిధి ఉన్నప్పుడు సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు.. బ్రిటిష్ హయాంలో ఈ వంతెనకు ఆడమ్స్ బ్రిడ్జి అని నామకరణం చేశారు.. అంతేకాదు రాముడి ఉనికికి సైద్దాంతిక నిరూపణ లేదని వాదించారు.. అంతేకాదు ఆ మధ్య డిస్కవరీ ఛానల్ లో ప్రసారమైన కథనానికి సంబంధించి చేసిన ప్రయోగాలు మొత్తం శ్రీలంకలో జరిపినవే.. కానీ రామసేతు వంతెన ఉన్నది భారత సముద్ర జలాల్లో.. మరి దానికి దీనికి ఎలా లంకె కుదురుతుందో శాస్త్రవేత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది.. ఇక శ్రీలంకలో చేసిన ప్రయోగాల ఆధారంగా ఆ ఇటుకల మీద ఉన్న కార్బన్ పరమాణువుల చలన ఆధారంగా ఆ వంతెన వయసు గుర్తించారు.. వారు వెల్లడించిన గణాంకాలు త్రేతా యుగం నాటి కాలానికి సరిపోవడం విశేషం.. ఆ రోజుల్లో కొన్ని కోట్ల వానర సైన్యాన్ని భారతదేశం నుంచి తరలించి యుద్ధం చేయడం అంటే మామూలు విషయం కాదు.. ఇక ఈ వంతెన కొన్నిచోట్ల ఇరుగుగా, కొన్నిచోట్ల వెడల్పుగా ఉంది.

    9 లక్షల సంవత్సరాల క్రితమే

    ఇక ఈ వంతెన పై జర్మన్ బృందం అనేక పరిశోధనలు జరిపింది.. కార్బన్ డేటింగ్ చేసి తొమ్మిది లక్షల సంవత్సరాలుగా తేల్చి చెప్పింది.. 2004లో భారత్ మీద సునామి వీరుచుకుపడినప్పుడు, ఆ భయంకరమైన అలలు దక్షిణాదిన ఉన్న తమిళనాడు, కేరళ మీద పడకుండా రామ సేతువు ఆపింది. ఒకవేళ ఆలలే మీద పడి ఉంటే తమిళనాడు, కేరళ ప్రాంతాలు నామరూపాలు లేకుండా పోయేవి. ఇప్పుడు ఈ రామ సేతువును కూల్ చేసే సేతుసముద్రం ప్రాజెక్టు నిర్మాణం చేయాలని తమిళనాడు ప్రభుత్వం యోచిస్తోంది.. గతంలో దీనిని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది.. కానీ ఇప్పుడు అధికార డిఎంకెతో స్వరం కలిపింది..

    Ram Setu

    భిన్నమైన వాతావరణం

    రామసేతు ఉన్న ప్రాంతంలో భిన్నమైన వాతావరణం ఉంది.. ఆ ప్రాంతంలో అరుదైన శైవల జాతులు ఉన్నాయి. వీటిల్లో ఆల్గే అనే రకం మీద శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు.. అయితే వాటిల్లో ఉన్న ప్రత్యేక గుణాలు వివిధ రకాలైన దీర్ఘకాలిక రుగ్మతలను తగ్గిస్తాయని తేల్చి చెప్పారు.. రామసేతువు నిర్మించిన ప్రాంతంలో మెరైన్ అట్మాస్పియర్ నెలకొంది.. ఈ ప్రాంతంలోనే అరుదైన సముద్ర జాతులు ఉన్నాయి.. ఒకవేళ ఆ సేతువును కనుక కూల్చివేస్తే అక్కడ ఉన్న జీవరాశి పూర్తిగా నాశనం అవుతుంది.. లక్షలాదిమంది జాలర్లు ఉపాధి కోల్పోతారు.. కానీ ఇవేవీ పట్టకుండా డీఎంకే ప్రభుత్వం సేతు సముద్రం ప్రాజెక్టు పై శాసనసభలో తీర్మానం చేయడం, పనికి అక్కడ ప్రతిపక్ష బిజెపి వంత పాడటం గమనార్హం..

    Tags