Homeఅంతర్జాతీయంUN Office In Kashmir: శెభాష్‌ జైశంకర్‌.. కశ్మీర్‌లో యూఎన్‌ ధర్మసత్రం షట్‌డౌన్‌

UN Office In Kashmir: శెభాష్‌ జైశంకర్‌.. కశ్మీర్‌లో యూఎన్‌ ధర్మసత్రం షట్‌డౌన్‌

UN Office In Kashmir: గోడకు బీటలు వారితే మరమ్మతు చేస్తా.. చెట్టుకు పురుగు పడితే మందులు చల్లుతాం.. కానీ అదే చెట్టుకు చెదలు పట్టి పనికి రాకుండా పోతే.. ప్రమాదకరంగా మారితే.. గోడ కారణంగా ఇల్లే కూలిపోయే పరిస్థితి వస్తే.. మొదటికే తొలగిస్తాం. అచ్చం ఇలాగే చేశారు ప్రధాని మోదీ, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌. చెదలు పట్టిన 74 సంవత్సరాల యునైటెడ్‌ నేషన్స్‌ మిలటరీ అబ్జర్వర్‌ గ్రూప్‌ ఇన్‌ ఇండియా అండ్‌ పాకిస్థాన్‌ అనే చెట్టును షట్‌డౌన్‌ చేశారు.

UN Office In Kashmir
UN Office In Kashmir

సైనిక ఘర్షణపై పర్యవేక్షణ కోసం..
యునైటెడ్‌ నేషన్స్‌ మిలటరీ అబ్జర్వర్‌ గ్రూప్‌ ఇన్‌ ఇండియా అండ్‌ పాకిస్థాన్‌ అనేది ఐక్యరాజ్యసమితికి సంబంధించిన పరిశీలక బృందం. దీని ముఖ్య ఉద్దేశం భారత్‌ – పాకిస్థాన్‌ మధ్య సైనిక ఘర్షణలను పర్యవేక్షిస్తూ నిత్యం నివేదకలు ఇవ్వడం. 1948లో నెహ్రూ కాశ్మీర్‌ సమస్యని ఐక్యరాజ్య సమితికి అప్పచెప్పడం వలన ఇది ఏర్పాటయింది. ఈ బృందానికి ఒక ఆఫీసు ఏర్పాటు చేసి, వాళ్లకి జీత భత్యాలతో సకల సదుపాయాలు ఏర్పాటు చేసింది.

చైనా భారత్‌ మధ్య కూడా సమస్య అని నివేదిక..
ఈ పరిశీలక బృందం జమ్మూకశ్మీర్‌ సమస్య అనేది భారత పాకిస్థాన్‌ మధ్య ఉన్నదే కాకుండా చైనాకి కూడా ఈ సమస్యలో భాగం ఉందని వారం క్రితం ఐక్యరాజ్య సమితికి ఒక నివేదిక ఇచ్చింది. అంతే కాకుండా తమ కార్యకలాపాలకు భారత్‌ తోపాటు చైనా కూడా అడ్డంకులు కల్పిస్తుందని ఫిర్యాదు చేసింది. అంతటితో ఆగకుండా ‘అన్నం పెట్టే యజమాని మీద కుక్క మొరగినట్లు’ తమకు ఇస్తున్న జీత భత్యాలు సరిపోవడం లేదని, ఆర్థిక సహాయాన్ని పెంచాలని కోరుతూ భారత ప్రభుత్వానికి, ఐక్యరాజ్య సమితికి మెమోరాండం ఇచ్చింది.

తిక్క కుదిర్చిన భారత్‌..
ఎప్పుడయితే తమకు ఇస్తున్న జీత భత్యాలు సరిపోవడం లేదని, వాటిని బాగా పెంచాలని అడిగారో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పరిశీలక బృందంలో పనిచేస్తున్న 40 మంది వీసాలను విదేశాంగ శాఖ రద్దు చేసింది. పది రోజుల్లో దేశం విడిచి వెళ్లిపొవాలని ఆదేశించింది. వాస్తవానికి ఈ పరిశీలక బృందానికి జీత భత్యాలు ఐక్యరాజ్యసమితి బడ్జెట్‌ నుంచి వస్తాయి. భారత్‌ ఎందుకు అదనంగా ఈ 40 మంది బృందానికి జీతాలు ఇస్తుందన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఈ బృందానికి హెడ్‌ క్వార్టర్స్‌ రెండు చోట్ల ఉన్నాయి. ఒకటి శ్రీనగర్‌లోని గుప్కార్‌ రోడ్‌లో.. రెండవది ఇస్లామాబాద్‌ లో. ఈ రెండు చోట్ల కార్యాలయాలు భారత్‌ పాకిస్థాన్‌ దేశాలు నిర్మించినవే.

74 ఏళ్లుగా భరిస్తున్నాం..
ఇక 40 మంది బృందానికి విలాసవంతమయిన ఇళ్లు, వాహనాలు, ఇళ్లలో పని వాళ్లు ఇలా చాలా సదుపాయాలు భారత ప్రభుత్వమే భరిస్తుంది. ఇవికాక ఇతర అలవెన్సుల పేరుతో భారీగా ఖర్చు అవుతుంది. వీళ్లకి వ్యక్తిగత వాహనాలతోపాటు సరిహద్దుల దగ్గరికి వెళ్లి రావడానికి మిలటరీ వాహనాలని సమకూర్చాల్సి ఉంటుంది. అలాగే వీటికి అయ్యే డీజిల్‌ ఇతర నిర్వహణ ఖర్చులు కూడా భారీగానే ఉంటున్నాయి. 74 ఏళ్లుగా భరిస్తున్న వీటినే ఇప్పుడు ఇస్తున్న వాటి కంటే ఇంకా పెంచమని బృందం డిమాండ్‌ చేస్తోంది.

వాళ్లు చేసే పని ఏమిటీ ?
ఇంత ఖర్చు పెట్టి, ఇన్ని సదుపాయాలు కల్పించిన ఈ బృందం ఏం చేస్తుందో తెలుసా.. జస్ట్, భారత్‌ పాకిస్థాన్‌ సరిహద్దుల వెంబడి ఏం జరుగుతుందో ఐక్యరాజ్య భద్రతా సమితిని నివేదిక ఇస్తూ ఉంటుంది. ఇది బయటి ప్రపంచానికి తెలింది. కానీ వీళ్లు ఎప్పటికప్పుడు అమెరికాకు వేరే నివేదిక ఇస్తూ వస్తున్నారు. ఈ బృందం నివేదికలతో 74 ఏళ్ల నుంచి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎలాంటి చర్య తీసుకోకుండా చోద్యం చూస్తుంది. ఇలాంటి పరిశీలక బృందాలని మన దేశంలో ఎందుకు ఉంచినట్లు? భారత ప్రభుత్వాలు మీ పరిశీలక బృందాలు అక్కరలేదు వెంటనే తీసేయండి అని చెప్పలేకపోయాయి అనేది సమాధానం లేని ప్రశ్న.

భారత సైన్యం కదలికల వివరాలు అమెరికాకు..
1971 బంగ్లాదేశ్‌ విముక్తి సందర్భంగా భారత సైన్యం కదలికలని అమెరికాకి చేరవేసింది ఈ పరిశీలక బృందమే. అప్పట్లో ఇప్పుడున్నటువంటి హై రిజల్యూషన్‌ ఫొటోలు తీసే ఉపగ్రహాలు అమెరికా వద్ద లేవు. ఈ పరిశీలక బృందం ఇచ్చిన సమాచారమే కీలక పాత్ర పోషించింది. ఇప్పటికీ నివేదిక అందిస్తూనే ఉంది.

UN Office In Kashmir
UN Office In Kashmir

కశ్మీర్‌ సమస్య జటిలం చేయడానికే..
పీవోకేలో కొద్ది భాగాన్ని పాకిస్థాన్‌ చైనాకి దానం చేసిన సంగతి తెలిసిందే.. కానీ ఇందులో చైనాని కలపడం దేనికి? భారత్‌ని స్వాధీనం చేసుకుంటే అప్పుడు పాకిస్థాన్‌ చైనాకి దానం చేసిన భూమి కూడా మన అధీనంలోకి వచ్చినట్లే టెక్నికల్‌గా.. అప్పుడు చైనా ఎలా ప్రతిస్పందిస్తుందో దానిని బట్టి భారత్‌ ప్రతిస్పందన ఉంటుంది. అంతే కానీ సమస్య భారత్‌ పాకిస్థాన్‌ మధ్య అయితే చైనాని పార్టీగా చేయడంలో పరిశీలక బృందం వ్యూహం ఏమిటో అర్థమతోంది. వీళ్ల ఉద్దేశం కాశ్మీర్‌ అంశాన్ని మరింత జటిలం చేయడమే. దానికి చైనాని కూడా ఇంకో పార్టీగా చేర్చింది.

వదిలేస్తే మరో చిచ్చు..
మరో ఏడాదిలో దేశంలో ఎన్నికలు జరుగనున్న వేళ పరిశీలక బృందం మరో చిచ్చు పెట్టే ప్రయత్నంలో ఉన్నట్లు కేంద్రం పసిగట్టింది. అప్రమత్తమైన ప్రధాని మోదీ, విదేశాంగ శాఖమంత్రి జైశంకర్‌ ఆలస్యం చేయకుండా వీళ్ల వీసా రద్దు చేశారు. దేశం వదిలి పోవాలని హుకూం జారీ చేశారు.

74 ఏళ్ల క్రితం నెహ్రూ నాటిన విషపు మొక్క పెరిగి మహా వృక్షంగా మారి చెదలు పట్టి ఆ చెదలు పక్కన ఉన్న మంచి చెట్లకి పాకి వాటి నాశనానకి కారణం అవుతోంది. ఈ తరుణంలో ఏ ప్రభుత్వం కూడా ధైర్యంగా ఆ చెట్టుని సమూలంగా నరికివేయడానికి ముందుకు రాలేదు. ఈ బృందాన్ని వెనక్కి వెళ్లిపొమ్మని వాళ్ల వీసాలు రద్దు చేయలేదు. మోదీ సర్కార్‌ ధైర్యంతో తీసుకున్న చర్యతో చెదలుపట్టిన మహా వృక్షం కూలిపోయింది. బృందాలు వెనక్కి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version