Shruti Haasan: విదేశాల్లో మిడిల్ ఫింగర్ చూపించడం పెద్ద బూతు. దాన్ని వెరీ అగ్రెసివ్, అబ్యూస్ బాడీ లాంగ్వేజ్ గా పరిగణిస్తారు. ఈ క్రమంలో శృతి హాసన్ మిడిల్ ఫింగర్ చూపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. శృతి ఎవరిని తిడుతున్నారు? ఎవరికి ఐ డోంట్ కేర్ అని చెబుతున్నారు? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇటీవల శృతిపై ఒక రూమర్ ప్రముఖంగా వినిపిస్తోంది. శృతి లవర్ శాంతను హజారికతో విడిపోయారంటూ కథనాలు వెలువడుతున్నాయి. రెండేళ్లకు పైగా ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో శృతి హాసన్ సహజీవనం చేస్తున్నారు.

శాంతను-శృతి ఒకే ఇంట్లో ఉంటున్నారు. వీరి రిలేషన్ బహిరంగ రహస్యమే. ఎందుకంటే శృతి తన పర్సనల్ లైఫ్ ఏమీ దాచుకోదు. శాంతనుతో తన హ్యాపీ మూమెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అయితే ఎప్పుడూ తాము ప్రేమించుకుంటున్నట్లు, కలిసి జీవిస్తున్నట్లు చెప్పలేదు. ఫోటోలు చూసి మీరే అర్థం చేసుకోండి అంటుంది. శాంతను హజారికను తండ్రి కమల్ హాసన్ కి కూడా పరిచయం చేసింది. ఒక బర్త్ డే పార్టీలో శృతి కుటుంబ సభ్యులతో పాటు శాంతను పాల్గొన్నాడు.
అయితే కొద్దిరోజులుగా శృతి ప్రియుడు శాంతనుతో కనిపించడం లేదు. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేసి చాలా రోజులు అవుతుంది. అదే సమయంలో ఒంటరి తనమే సంతోషం ఇస్తుంది. నన్ను నేను ప్రేమించుకోవడం, నా విలువైన సమయాన్ని నా కోసమే వాడుకోవడం ఎంత ముఖ్యమైనదో నాకు ఇప్పుడు తెలిసొచ్చింది.. అంటూ ఒక ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టింది. ఒంటరితనాన్ని ఆస్వాదిస్తున్నాను అంటున్న శృతి హాసన్… ప్రియుడితో విడిపోయారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. శృతి కొత్త ప్రియుడికి కూడా గుడ్ బై చెప్పేశారంటూ కథనాలు తెరపైకి వచ్చాయి.

ఈ వార్తలపై శృతి స్పందించలేదు. అసలు శాంతను తన లవర్ అని చెప్పని శృతి బ్రేకప్ వార్తలకు ఎందుకు క్లారిటీ ఇస్తారు చెప్పండి. ఈ నేపథ్యంలో శృతి మిడిల్ ఫింగర్ చూపుతూ సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేయడం ఆసక్తి రేపుతోంది. బ్రేకప్ రూమర్స్ రాస్తున్న మీడియాకు అలా వార్నింగ్ ఇచ్చిందా? లేక విడిపోయిన శాంతనుకు తన స్టైల్ లో సమాధానం చెప్పిందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే శృతి ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉన్నారు. వాల్తేరు వీరయ్య మూవీ షూట్ లో భాగంగా ఆమె అక్కడకు వెళ్లారు. చిరంజీవి-శృతిపై ఒక డ్యూయట్ షూట్ చేశారు.