Allu Arjun Receives Leading Man Award: మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ నలుమూలల విస్తరింపచేసిన సినిమాలలో ఒకటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ : మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ నలుమూలల విస్తరింపచేసిన సినిమాలలో ఒకటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప..ఒక సాధారణ కమర్షియల్ సినిమా కి ఈ స్థాయి గుర్తింపు లభించడం చాలా అరుదు..అల్లు అర్జున్ నటన మరియు ఆయన చూపించిన మ్యానరిజమ్స్ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లింది.

రాజకీయ నాయకులూ , సినీ నటుల దగ్గర నుండి క్రికెట్ ప్లేయర్స్ మరియు ఫుట్ బాల్ ప్లేయర్స్ వరుకు ప్రతీ ఒక్కరు ‘తగ్గేదే లే ‘ మ్యానరిజమ్స్ చేసారు..ఒక సినిమా ఇంతలా జనాలను ప్రభావితం చెయ్యడం గతం లో ఎప్పుడూ కూడా జరగలేదు..ఇదంతా కేవలం అల్లు అర్జున్ మ్యాజిక్ అని చెప్పొచ్చు..అందుకే ఆయనకీ ఈ సినిమా ద్వారా అన్ని అవార్డ్స్ వచ్చాయి..ఇప్పుడు లేటెస్ట్ గా ఆయనకీ GQ మ్యాగజైన్ అందిస్తున్న ప్రతిష్టాత్మక అవార్డ్స్ లో ‘లీడింగ్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ ‘ అవార్డు దక్కింది.
ప్రతీ ఏడాది ఫ్యాషన్, కల్చర్ సినిమా మరియు పాలిటిక్స్ రంగాలకు పలు విభాగాలలో ఈ అవార్డ్స్ ఇస్తుంటారు..ఈ ఏడాది ఆ అవార్డు ని అల్లు అర్జున్ దక్కించుకున్నారు..తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుండి ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న ఏకైక వ్యక్తిగా అల్లు అర్జున్ సరికొత్త చరిత్ర సృష్టించాడు..ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా అనందం ని అభిమానులతో పంచుకున్నాడు.

ప్రస్తుతం ఆయన పుష్ప 2 లో నటించడానికి సిద్ధం అవుతున్నాడు..దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అయ్యింది..సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడు..ఈమధ్యనే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోబోతుంది..పుష్ప సినిమా విడుదలై ఏడాది కావొస్తుంది..కానీ ఇప్పటి వరుకు పార్ట్ 2 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు.
పార్ట్ 1 కి ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరూ ఊహించని రీతిలో రీచ్ రావడం వల్లే పార్ట్ 2 లో ప్రతీ షాట్ అభిమానుల అంచనాలకు మించి ఉండేలాగా సుకుమార్ చాలా శ్రద్ద తీసుకుంటున్నాడు..అందుకే అంత లేట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.