Shruti Haasan: శృతి హాసన్ లివింగ్ రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. రెండేళ్లకు పైగా ఆమె, శాంతను హజారిక కలిసి జీవిస్తున్నారు. ఈ చెన్నై చిన్నది ముంబైకి మకాం మార్చేసింది. ప్రియుడి కోసం అక్కడే ఉంటుంది. సౌత్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న నేపథ్యంలో ముంబై టు హైదరాబాద్ ట్రావెల్ చేస్తుంది. ఇక శాంతనుతో శృతి ఎఫైర్ బహిరంగ రహస్యమే. అందులో ఎలాంటి దాపరికం లేదు. తాజాగా శాంతను గురించి కొన్ని ఆసక్తికర విషయాలు శృతి షేర్ చేశారు. శాంతను గుణగణాలు, మంచి బుద్ధులు ఫ్యాన్స్ తో పంచుకున్నారు.

శాంతను నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరం ఎప్పుడూ కలిసే ఉంటాము. కలిసి జీవిస్తున్నాము. మా గురించి వచ్చే సోషల్ మీడియా కామెంట్స్ జంటగా చదువుతాము. అవి భలే ఫన్నీగా ఉంటాయి. ఆ కామెంట్స్ చదువుతూ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాము. శాంతను మంచి వ్యక్తి. తన వలన నాలో కొన్ని మార్పులు వచ్చాయి. నేను ప్రశాంతంగా మారిపోయాను. నాలో దయాగుణం కూడా ఎక్కువైంది. శాంతను ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. ఇతరుల పట్ల దయ కలిగి ఉంటాడు. అతనిలోని ఈ రెండు లక్షణాలు నాకు చాలా ఇష్టం. నేను కూడా వాటిని అలవరుచుకున్నాను. అందుకే శాంతను అంటే నాకు ప్రీతి… అని శృతి చెప్పుకొచ్చారు.
ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతానికి శృతిని సంతోషంగా ఉంచగల ఏకైక వ్యక్తి శాంతను. అతడి సాన్నిహిత్యాన్ని ఆమె ఆస్వాదిస్తున్నారు. శాంతను పక్కన ఉంటే ప్రశాంతత ఫీల్ అవుతుంది. కాగా ఇటీవల శాంతను కి కూడా శృతి గుడ్ బై చెప్పేసిందంటూ వార్తలు వచ్చాయి. ఒంటరితనమే శాశ్వతం, అదే బాగుంది అంటూ… శృతి ఒక పోస్ట్ పెట్టింది. దానర్థం బ్రేకప్ అని అందరూ భావించారు. అయితే తాను శాంతను విడిపోలేదని ఆమె తరువాత పోస్ట్స్ తో స్పష్టత వచ్చింది.

ఇక శృతి కెరీర్ ట్రాక్ లో పడింది. ఆమె హీరోయిన్ గా నటించిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతి కానుకగా విడులవుతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి హీరోయిన్ గా శృతి హాసన్ అవతరించనుంది. అలాగే ఆమె ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ సలార్ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. సలార్ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. 2023లో సలార్ విడుదల కానుంది.