Shruti Haasan: శృతి హాసన్ వ్యక్తిగత జీవితంపై తరచూ వార్తలు వస్తుంటాయి. తాజాగా ఆమె బ్రేకప్ రూమర్స్ ఎదుర్కుంటున్నారు. ఒంటరిగా ఉండటమే బెటర్, మనతో ఉండేది మనమే, మన సమయం చాలా విలువైనది అంటూ ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది శృతి. ఒంటరితనం బెటర్ అంటున్న శృతి తీరు చూస్తుంటే లవర్ తో బ్రేకప్ అయ్యిందంటూ కథనాలు వెలువడ్డాయి. రెండేళ్లకు పైగా శృతి హాసన్ శాంతను హజారిక అనే ముంబై వ్యక్తితో సహజీవనం చేస్తున్నారు. శాంతను డూడుల్ ఆర్టిస్ట్. వీరి పరిచయం ప్రేమగా మాదిరి సహజీవనం వైపుకు దారితీసింది. ఇందులో శృతి దాచుకునేదేమీ లేదు. శాంతను-శృతి ఎఫైర్ బహిరంగ రహస్యమే.

ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. అతడితో దిగిన ఫోటోలు శృతి ఫ్యాన్స్ తో షేర్ చేస్తారు. వీరి మధ్య గొడవలు వచ్చాయి. విడిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ పుకార్లకు శృతి ఒక్క పోస్ట్ తో చెక్ పెట్టారు. అవన్నీ అబద్ధాలని క్లారిటీ ఇచ్చేశారు. ప్రియుడు శాంతను హగ్ చేసుకున్న ఫోటో ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసిన శృతి… ‘నాకు కావాల్సింది ఇదే కదా’ అంటూ కామెంట్ జోడించింది. మేము ఇంత ఘాడంగా ప్రేమించుకుంటుంటే విడిపోయామడానికి మీకు నోళ్లు ఎలా వచ్చాయన్నట్టుంది శృతి పోస్ట్.
శృతి ఒకటి రెండు సందర్భాల్లో తండ్రి కమల్ హాసన్ తో పాటు కుటుంబ సభ్యులకు శాంతను హజారికను పరిచయం చేసింది. అలా అని పెళ్లి గిళ్లి లాంటి వ్యవహారాలు పెట్టుకోదు. రిలేషన్ బోరు కొట్టనంతకాలం కలిసి ఉంటుంది. తర్వాత హ్యాపీగా విడిపోతుంది. పెళ్లి అంటే నాకు చచ్చేంత భయం అని శృతి నేరుగానే చెప్పింది. కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. శాంతను లాంటి అబ్బాయిలు ఆమె జీవితంలోకి చాలా మంది రావచ్చు.

లండన్ కి చెందిన మైఖేల్ కోర్ల్స్ తో శృతి కొన్నాళ్ళు ఎఫైర్ నడిపారు. మైఖేల్-శృతి విచ్చలవిడిగా ప్రేమించుకున్నారు. 2019లో ఇద్దరూ బ్రేకప్ చెప్పుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు. గతంలో హీరోలు సిద్ధార్థ్, ధనుష్ లతో కూడా శృతి హాసన్ ఎఫైర్స్ నడిపారన్న పుకార్లు ఉన్నాయి. మీడియా పెళ్లి ఎప్పుడని అడిగితే.. నా పెళ్ళికి సంగతి మీకెందుకని మండిపడుతుంది. కాగా శృతి హీరోయిన్ గా నటించిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్నాయి.