Avatar 2 Collections: సుమారు 12 ఏళ్ళ పాటు ఎన్నో కష్టాలు పడి సరికొత్త టెక్నాలజీ తో జేమ్స్ కెమరూన్ తెరకెక్కించిన అవతార్ 2 చిత్రం ఇటీవలే విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకొని థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తుంది..ఓపెనింగ్స్ పెద్దగా లేకపోయినప్పటికీ, ఫుల్ రన్ ఈ చిత్రానికి బాగానే వచ్చేటట్టు కనిపిస్తుంది..వీకెండ్ కి 420 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రానికి ఆరు రోజులకు గాను 500 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు వచ్చాయి.

ఈ చిత్రానికి ఇప్పుడు క్రిస్మస్ వీకెండ్ చాలా అత్యవసరం..ఈ వీకెండ్ లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టాలి..ఎందుకంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ మామూలుది కాదు..రెండు బిలియన్ డాలర్లు వసూలు చెయ్యాలి..అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 16 వేల కోట్ల రూపాయిలు అన్నమాట..ఇప్పటి వరుకు ఈ చిత్రానికి నాలుగు వేల కోట్ల రూపాయిల వసూళ్లు వచ్చాయి..ఇంకా నాలుగు రేట్లు ఎక్కువ వసూళ్లను రాబట్టాలి..న్యూ ఇయర్ లోపు ఈ మార్కుని అందుకుంటుందని హాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లే వచ్చాయి..ఇప్పటి వరుకు ఈ సినిమాకి హిందీ వెర్షన్ లో ఆరు రోజులకు గాను 175 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి..గ్రాస్ 230 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా..తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరుకు ఈ చిత్రానికి 55 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి..వీటిని షేర్ కి లెక్కగడితే 28 కోట్ల రూపాయిలు అన్నమాట.

ఈ సినిమా తెలుగు లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే వంద కోట్ల రూపాయిలు షేర్ వసూళ్లను రాబట్టాలి..అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పొచ్చు..ఎందుకంటే అంతటి లాంగ్ రన్ మన టాలీవుడ్ టాప్ హీరోస్ కి కూడా రాదు..ఫుల్ రన్ లో మహా అయితే 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టొచ్చు..అంటే 40 కోట్ల రూపాయిల నష్టం కచ్చితంగా వాటిల్లే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.