
Chandrababu Security: నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్…అత్యున్నత రక్షణ సంస్థ. అయితేనేం ఏపీ పోలీసుల వద్ద దిగదుడుపే.దేశ వ్యాప్తంగా రాజకీయ, ఇతరత్రా ప్రముఖులకు రక్షణ కల్పించడం ఎన్ఎస్ జీ ప్రధాన విధి. ఆయా రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుుంటూ ప్రముఖుల రక్షణలో కీ రోల్ ప్లే చేస్తోంది. అయితే ఏపీలో మాత్రం వారికి సహకారం కొరవడుతోంది. ముఖ్యంగా విపక్ష నేత చంద్రబాబు రక్షణ కత్తిమీద సాములా మారుతోంది. ఏపీ పోలీస్ సహకరించకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం అధికార పక్షం విపక్ష నేత చంద్రబాబును టార్గెట్ చేసుకుంటూ వస్తోంది. సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సమయంలో వైసీపీ శ్రేణులు విధ్వంసానికి దిగాయి. తాజాగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చంద్రబాబు కాన్వాయ్ పైనే దాడిచేశారు. ఓ ఎన్ఎస్ జీ కమెండోకు గాయాలు కూడా తగిలాయి. దీంతో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ సంస్థ సీరియస్ అయినట్టు తెలుస్తోంది.
ఇటీవలే సెక్యూరిటీ పెంపు..
చంద్రబాబు సెక్యూరిటీ విషయంలో ఎదురవుతున్న అపశృతులు గురించి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ సంస్థ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ఇటీవల సెక్యూరిటీని సైతం పెంచారు. అత్యంత సుశిక్షుతులైన ఎన్‌ఎస్‌జీ కమెండోలు రక్షణగా ఉంటున్నారు. ఏపీలో దిగజారుతున్న శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకొనే చంద్రబాబుకు సెక్యూరిటీ పెంచినట్టు వార్తలు వచ్చాయి. విపరీత మనస్తత్వంతో ఉన్న అధికార పార్టీ నేతల మాటలు, చేతలు కూడా అలానే ఉండడంతో కేంద్ర రక్షణ సంస్థ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు 12 మంది సుశిక్షితులైన కమెండోలు జడ్ ప్లస్ కేటగిరి భద్రత చంద్రబాబుకు ఇస్తున్నారు. జెడ్ ప్లస్ అంటే.. ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రోటోకాల్ కూడా ఉంటుంది. కానీ ఏపీలో అవేవీ అమలు కావడం లేదు. అసలు పోలీస్ శాఖ పూర్తిగా సహకరించడమే మానేసింది.
దేశ వ్యాప్తంగా చర్చ..
చంద్రబాబు కాన్వాయ్ పై తరచూ దాడులు జరుగుతుండడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రభావం నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ సంస్థపై పడుతోంది. అయితే ఏపీ పోలీస్ వ్యవస్థ సహాయ నిరాకరణ ఫలితంగానే ఏమీ చేయలేకపోతున్నామన్న ఆవేదన ఎన్ఎస్ జీలో వ్యక్తమవుతోంది. ఏపీ పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. వారు రాజకీయ కుట్రల్లో భాగం అవుతున్నారు. నేరాలకు సహకరిస్తున్నారు. అడ్డంగా దొరికిపోతున్నారు. ఎర్రగొండపాలెంలో జరిగిన ఘటనలో పోలీసుల తీరు దేశవ్యాప్త చర్చనీయాంశమయింది. చంద్రబాబు పై తరచూ రాళ్ల దాడి ఘటనలు జరగడాన్ని ఎన్‌ఎస్‌జీ హెడ్‌క్వార్టర్స్ సీరియస్‌గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాళ్ల దాడిపై ఎన్‌ఎస్‌జీ హెడ్ క్వార్టర్స్‌కు ఇక్కడి అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో అత్యున్నత రక్షణ సంస్థ రంగంలోకి దిగింది. సమగ్ర దర్యాప్తుచేస్తోంది.

కేంద్రం ఫోకస్..
ఏపీలో శాంతిభద్రతల విఘాతంపై కేంద్రం కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు సమాచారం చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగిన నేపథ్యంలో అలెర్టయ్యింది. అసలేం జరిగిందని ఎన్ఎస్ జీ నుంచి కేంద్ర హోం శాఖప్రత్యేక నివేదిక తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఏపీలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఎన్‌ఎస్‌జీ చంద్రబాబుకు రక్షణ కల్పించాల్సిన విధానంలో మార్పుల గురించి .. కేంద్ర హోంశాఖలో చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ డీజీపీకి స్పష్టమైన హెచ్చరికలు కేంద్ర హోంశాఖ నుంచి వచ్చే చాన్స్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఏపీ పోలీస్ శాఖపై కేంద్ర హోంశాఖ ఏ నిర్ణయం తీసుకున్నా.. అది మాయని మచ్చగా నిలుస్తుంది. ఒక వేళ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినా అది అవమానమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.