https://oktelugu.com/

సమంతపై శ్రీరెడ్డి బోల్డ్ కామెంట్స్.. అలా వ్యాపారం చేస్తుందంటూ పోస్టు..!

టాలీవుడ్ ఇండస్ట్రీ.. హీరోహీరోయిన్లపై ఎప్పుడు ఒక బ్యాచ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటోంది. ఈ బ్యాచులో వివాదాస్పద నటి శ్రీరెడ్డి.. దర్శకుడు రాంగోపాల్.. కత్తి మహేష్ లాంటి పేర్లు ప్రముఖంగా విన్పిస్తుంటాయి. వీరంతా నిత్యం టాలీవుడ్ ఇండస్ట్రీలోని వ్యవహారాలు.. హీరోహీరోయిన్లు.. రాజకీయ నాయకులపై బోల్డ్ కామెంట్స్ చేస్తూ పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు. Also Read: ‘బిగ్ బాస్’ను నడిపిస్తున్న తెలుగు సెలబ్రెటీ ఎవరంటే? టాలీవుడ్ పెద్దలైన మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ.. అక్కినేని నాగార్జున ఫ్యామిలీ.. పవర్ స్టార్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 29, 2020 / 03:08 PM IST
    Follow us on

    టాలీవుడ్ ఇండస్ట్రీ.. హీరోహీరోయిన్లపై ఎప్పుడు ఒక బ్యాచ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటోంది. ఈ బ్యాచులో వివాదాస్పద నటి శ్రీరెడ్డి.. దర్శకుడు రాంగోపాల్.. కత్తి మహేష్ లాంటి పేర్లు ప్రముఖంగా విన్పిస్తుంటాయి. వీరంతా నిత్యం టాలీవుడ్ ఇండస్ట్రీలోని వ్యవహారాలు.. హీరోహీరోయిన్లు.. రాజకీయ నాయకులపై బోల్డ్ కామెంట్స్ చేస్తూ పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు.

    Also Read: ‘బిగ్ బాస్’ను నడిపిస్తున్న తెలుగు సెలబ్రెటీ ఎవరంటే?

    టాలీవుడ్ పెద్దలైన మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ.. అక్కినేని నాగార్జున ఫ్యామిలీ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. రాజమౌళిలను నిత్యం వాళ్లు టార్గెట్ చేస్తూ కాంట్రావర్సీలతో పబ్బం గడుపుకుంటుండం చూస్తూనే ఉన్నాం. పలుసార్లు శ్రీరెడ్డి హీరోయిన్ల బాడీ షేమింగ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా శ్రీరెడ్డి మరోసారి సమంతపై బోల్డ్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

    సమంత పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తూ బీజీగా ఉంటోంది. సినిమాల్లో నటిస్తూనే టెలిజన్ రంగంపై దృష్టిసారింది. బిగ్ బాస్ లో హోస్టుగా ఆకట్టుకున్న సమంత.. ‘ఆహా’లోనూ హోస్ట్ గా చేస్తూ అలరిస్తోంది. అయితే ఇటీవల సమంత తన సోషల్ మీడియాలో మాల్దీవుల్లో దిగిన ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో సమంత బికినీ కన్పించింది. ఈ ఫోటోనే శ్రీరెడ్డి తాజాగా తన సోషల్ మీడియాలో పోస్టు చేసి బోల్డ్ కామెంట్స్ చేసింది.

    Also Read: బిగ్ బాస్-4: నాగార్జున అండతో ఆమె టైటిల్ విన్నర్ అవుతుందా?

    ‘హాయ్ గాయ్స్.. ఈ ఫొటోను చూడండి.. సమంతకు పెళ్లి అయిపోయింది.. అయినా కూడా తన అందంతో వ్యాపారం చేస్తోంది.. తన తర్వాత వంద తరాలకు సరిపడా డబ్బులున్నాయి.. అయినా సామ్ ఎందుకు అందంతో వ్యాపారం చేయాలని అనుకుంటుందో? అర్థం కావడం లేదంటూ’ బోల్డ్ కామెంట్స్ చేసింది. శ్రీరెడ్డి వ్యాఖ్యలకు కొందరు మద్దతు ఇస్తుండగా సమంత ఫ్యాన్స్ మాత్రం ఆమెపై మండిపడుతున్నారు. ప్రస్తుతం శ్రీరెడ్డి వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతుండటం గమనార్హం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్