https://oktelugu.com/

టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారిన సునీత  రెండో పెళ్లి..!

టాలీవుడ్లోని ప్రముఖ సింగర్లలోని సునిత ఒకరు. సీనియర్ గాయనిగా.. వ్యాఖ్యాతగా.. డబ్బింగ్ ఆర్టిస్టుగా సునితకు టాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. సినిమాల్లో పాటలు పాడుతూనే టెలివిజన్ రంగంలోని పలు షోలకు జడ్జిగా.. హోస్టుగా చేస్తూ సునిత అలరిస్తోంది. వెండితెరతోపాటు బుల్లితెరపై రాణిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. Also Read: సమంతపై శ్రీరెడ్డి బోల్డ్ కామెంట్స్.. అలా వ్యాపారం చేస్తుందంటూ పోస్టు..! సీనియర్ సింగర్ అయిన సునిత కొద్దికాలం క్రితం మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది. నాటి నుంచి ఆమె […]

Written By:
  • NARESH
  • , Updated On : November 29, 2020 / 03:11 PM IST
    Follow us on

    టాలీవుడ్లోని ప్రముఖ సింగర్లలోని సునిత ఒకరు. సీనియర్ గాయనిగా.. వ్యాఖ్యాతగా.. డబ్బింగ్ ఆర్టిస్టుగా సునితకు టాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. సినిమాల్లో పాటలు పాడుతూనే టెలివిజన్ రంగంలోని పలు షోలకు జడ్జిగా.. హోస్టుగా చేస్తూ సునిత అలరిస్తోంది. వెండితెరతోపాటు బుల్లితెరపై రాణిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.

    Also Read: సమంతపై శ్రీరెడ్డి బోల్డ్ కామెంట్స్.. అలా వ్యాపారం చేస్తుందంటూ పోస్టు..!

    సీనియర్ సింగర్ అయిన సునిత కొద్దికాలం క్రితం మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది. నాటి నుంచి ఆమె రెండో వివాహం చేసుకుంటుదనే వార్తలు విన్పిస్తున్నాయి. ఈ గాసిప్స్ ను పలుమార్లు ఆమె ఖండించింది. అయినప్పటికీ ఆమె రెండో వివాహం గురించి నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి.

    సునితకు పెళ్లయి పిల్లలు ఉన్నప్పటికీ ఆమె అందం మాత్రం ఏమాత్రం చెక్కు చెదరలేదు. హీరోయిన్ల స్థాయిలో సునిత గ్లామర్ మెయింటెన్ చేయడంతో ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా సునిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఒంటరి జీవితాన్ని గడుపుతున్నానని.. తనపై వస్తున్న పుకార్లు నమ్మవద్దంటూ పేర్కొంది.

    Also Read:  ‘బిగ్ బాస్’ను నడిపిస్తున్న తెలుగు సెలబ్రెటీ ఎవరంటే?

    ఇదిలా ఉంటే సునిత డిజిటల్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ బిజినెస్ మెన్ ను వివాహం చేసుకోబోతుందనే టాక్ విన్పిస్తోంది. సునిత పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కూడా రెండో పెళ్లేనని వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. దీనిపై సునిత ఎలా రియాక్టవుతోంది వేచిచూడాల్సిందే..!

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్