Karthika Deepam Serial Effect: సాధారణంగా టీవీ సీరియల్ అంటే ఇష్టపడని ఆడవారు ఉండరు. కొందరు పెళ్లాల మాట వింటారు. అరుదుగా మొగుళ్ల మాట వినే వారు ఉంటారు. ఎక్కడైనా సీరియళ్లు లేడీస్ ఎక్కువగా చూస్తారు. మగవారు పెద్దగా పట్టించుకోరు. కానీ ఇక్కడ ఓ మగాడే సీరియల్ కు బానిస అయ్యాడు. టీవీ సీరియల్ వస్తుంటే అదే పనిగా చూస్తూ ఉత్త్రేరకం చెందుతుంటాడు. అందులో లీనమై పోతుంటాడు. దీంతో అతడికి ఇతర కేకలు వింటే శివాలెత్తుతుంది. అది ఎవరైనా సరే దాడికి తెగబడుతుంటాడు. సీరియల్ చూస్తున్నప్పుడు మధ్యలో వేలు పెట్టాడని ఓ వ్యక్తి వేలు కొరికిన ఘటన సంచలనం కలిగించింది. సీరియల్ చరిత్రలోనే వింత గొలిపే సంఘటన వివరాలు వింటే ఆశ్చర్యపోవడం ఖాయం.

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటకు చెందిన మొగిలి గ్రామంలో కిరాణా, బెల్ట్ షాపు నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన వెంకటయ్య బెల్ట్ షాపులో మద్యం కొనుగోలు చేసి తాగుతున్నాడు. ఈ నేపథ్యంలో మద్యం అయిపోవడంతో మరో బాటిల్ కావాలని వెంకటయ్య అడిగాడు. కార్తీక దీపం సీరియల్ చివరి ఎపిసో్డ్ వస్తుండటంతో అందులో లీనమయ్యాడు మొగిలి. ఇంతలో వెంకటయ్య మద్యం కోసం కేక వేయడంతో మొగిలి అసహనానికి గురయ్యాడు. వెంకటయ్య కుడి చేతి చూపుడు వేలును కొరికాడు.
దీంతో రక్తం కారుతున్న వెంకటయ్య అరుపులు వేశాడు. సంఘటనపై అందరు గుమిగూడారు. మొగిలి నిర్వాకంపై పోలీసులకు మరుసటి రోజు వెంకటయ్య ఫిర్యాదు చేశాడు. తనపై దాడికి పాల్పడిన మొగిలిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు. పోలీసులు వెంకటయ్యపై ఎందుకు దాడి చేశావని అడిగితే కార్తీక దీపం చివరి ఎపిసోడ్ వస్తుండగా ఆసక్తిగా చూస్తున్నానని ఇంతలో అతడు కేకలు వేయడంతో కోపం పెరిగిందని అందుకే అతడి వేలు కొరికానని చెప్పడంతో నివ్వెరపోయారు.

సీరియల్ కోసం ఓ వ్యక్తిపై దాడికి పాల్పడటం ఇదే ప్రథమం. ఒక్కోసారి గమ్మత్తైన సంఘటనలు జరుగుతుంటాయి. సీరియల్ చూస్తుండగా పిలిచాడనే అక్కసుతో అతడి వేలును కొరికిన మొగిలి తీరును అందరు గర్హించారు. అంత సహనం లేనివాడు దుకాణం ఎందుకు పెట్టుకున్నాడని ప్రశ్నిస్తున్నారు. మందు అయిపోయిందని అడగడం కూడా తప్పేనా అని నిష్టూరపోయారు. సీరియల్ మీద ఉన్న ఆసక్తి మనుషులపై లేదని మండిపడుతున్నారు. మద్యం అడిగిన పాపానికి వేలు కొరికిన విధానం అందరిలో ఆలోనలు రేకెత్తిస్తోంది.
