Rashmika Mandanna: హీరోయిన్స్ కి గ్లామరే పెట్టుబడి. అందంగా కనిపిస్తూ మేకర్స్ కంట్లో పడాలి. నాలుగు ఆఫర్స్ రాబట్టాలి. అలాగే పబ్లిక్ లో ఫేమ్ తెచ్చుకోవాలి. అప్పుడే కెరీర్ కి భరోసా ఉంటుంది. ఎక్కువ రోజులు పరిశ్రమలో ఉండే మైలేజ్ దక్కుతుంది. అలా అని పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు కూడా దారుణమైన బట్టలు ధరిస్తే అవమానాలపాలు కాక తప్పుడు. జనాల్లోకి వచ్చే తప్పుడు బట్టల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించాలి. ఇది తెలియక రష్మిక మందాన ఒకసారి అడ్డంగా బుక్ అయ్యారు. బాగా షార్ట్ లెంగ్త్ డ్రెస్ వేసుకొని ఈవెంట్ కి హాజరుకావడంతో అభిమానులు, మీడియా చుట్టుముట్టారు.

ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ కి రష్మిక రెడ్ కలర్ మినీ స్కర్ట్ లో వచ్చింది. చాలా కురచగా ఉన్న ఆ డ్రెస్ లో కూర్చోవడానికి కూడా ఆమె ఇబ్బంది పడ్డారు. దానికి తోడు పక్కన సెక్యూరిటీ కూడా లేరు. దీంతో ఆమెతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. పక్కనే కూర్చొని సెల్ఫీలు తీసుకున్నారు. వారు ఏం చేస్తున్నా రియాక్ట్ కాలేని పరిస్థితి నెలకొంది. నవ్వుతూ ఫోటోలకు ఫోజులివ్వడం తప్పా ఏం చేయలేకపోయింది. మీడియాతో పాటు జనాల తాకిడిని తట్టుకోలేక, ఆ కురచ డ్రెస్ లో ఫ్రీగా కదల్లేక నానా తంటాలు పడింది. ఎప్పుడు ఈ ఈవెంట్ ఐపోతుందా అని ఆమె దండం పెట్టుకున్నారు.
ఆ రోజైతే రష్మిక ఇలాంటి డ్రెస్ వేసుకోకూదని నిర్ణయించుకొని ఉంటారు. అయితే హీరోయిన్స్ కి ఇవన్నీ కామనే. అలా అని వారేమీ మారిపోరు. నిండైన బట్టలు ధరించరు. అందులోనూ రష్మిక బాలీవుడ్ లో ఎదగాలనుకుంటున్నారు. మరి బాలీవుడ్ ని ఏలాలి అంటే స్కిన్ షో తప్పనిసరి. కాగా ప్రస్తుతం రష్మిక పుష్ప షూట్ లో పాల్గొంటున్నారు. ఇటీవలే అల్లు అర్జున్-సుకుమార్ ఈ చిత్ర షూట్ స్టార్ట్ చేశారు. పుష్ప 2 మూవీలో శ్రీవల్లిగా మరోసారి ప్రేక్షకులను రష్మిక అలరించనుంది. సీక్వెల్ లో ఆమె పాత్ర ఎలా ఉంటుందనే ఆసక్తి కొనసాగుతుంది.

ఇక బాలీవుడ్ స్టార్ రన్బీర్ కపూర్ కి జంటగా యానిమల్ మూవీ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్ర దర్శకుడిగా ఉన్నారు. యానిమల్ కూడా సెట్స్ పై ఉంది. మరోవైపు విజయ్ దేవరకొండతో లవ్ అఫైర్ రూమర్స్ తో ఆమె వార్తల్లోకి ఎక్కారు. విజయ్ దేవరకొండ-రష్మిక ప్రేమించుకుంటున్నారనే ప్రచారం గట్టిగా నడుస్తుంది. ఆ మధ్య మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లిన ఈ జంట… తాజాగా దుబాయిలో తేలారు. మరోసారి జంటగా ఇంటర్నేషనల్ ట్రిప్ కి వెళ్లారు. దుబాయిలో చక్కర్లు కొడుతున్న వీరి ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
