
దేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది మృతి చెందుతున్న సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో ఎక్కువమంది ద్విచక్ర వాహనదారులే కావడం గమనార్హం. ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో వేల సంఖ్యలో వాహనదారులు క్షతగాత్రులవుతున్నారు. సరైన ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఎక్కువమంది ప్రమాదాల బారిన పడుతున్నట్టు తెలుస్తోంది.
రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్న వారిలో ఎక్కువమంది తలకు బలమైన గాయాలు కావడం వల్లే చనిపోతున్నారని తెలుస్తోంది. రోడ్డు ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం హెల్మెట్ ను తప్పనిసరి చేయడంతో పాటు హెల్మెట్ ను ధరించాలని వాళ్లకు జరిమానాలను విధించాలని అధికారులకు ఆదేశించింది. ఫలితంగా హెల్మెట్ ధరించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
అయితే పోలీసు చలానాల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో చాలామంది వాహనదారులు నకిలీ హెల్మెట్లను ఉపయోగిస్తున్నారు. తక్కువ నాణ్యత ఉన్న హెల్మెట్లు వాడిన వాళ్లు సైతం ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు దేశంలో చోటు చేసుకుంటూ ఉండటం గమనార్హం. నకిలీ హెల్మెట్ల వాడకం వల్లే పలువురు వాహనదారులు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఫలితంగా జూన్ 1 నుంచి బీఐఎస్ గుర్తు ఉన్న హెల్మెట్లు ధరిస్తే మాత్రమే జరిమానా నుంచి తప్పించుకోవచ్చు.
వాహనదారులకు నకిలీ హెల్మెట్లను, నాసిరకం హెల్మెట్లను అమ్మితే వ్యాపారులపై కూడా కేసులు నమోదు చేస్తామని అధికారులు చెబుతుండటం గమనార్హం. నాణ్యమైన హెల్మెట్ ను వాడి ప్రాణాలను రక్షించుకోవాలని అధికారులు సూచనలు చేస్తున్నారు.