https://oktelugu.com/

మాంసాహారం ఎక్కువగా తినేవారికి షాకింగ్ న్యూస్..?

మన దేశంలో శాఖాహారంతో పోలిస్తే మాంసాహారం తినే వారి సంఖ్య ఎక్కువనే సంగతి తెలిసిందే. అయితే శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో శాఖాహారులకు కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయని.. మాంసాహారం తీసుకునే వారికి కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడైంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా 17 నగరాల్లో కరోనా వ్యాప్తికి సంబంధించి ఈ అధ్యయనం జరిగింది. ప్రాథమిక అవగాహన కోసమే ఈ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 26, 2021 / 01:49 PM IST
    Follow us on

    మన దేశంలో శాఖాహారంతో పోలిస్తే మాంసాహారం తినే వారి సంఖ్య ఎక్కువనే సంగతి తెలిసిందే. అయితే శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో శాఖాహారులకు కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయని.. మాంసాహారం తీసుకునే వారికి కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడైంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా 17 నగరాల్లో కరోనా వ్యాప్తికి సంబంధించి ఈ అధ్యయనం జరిగింది.

    ప్రాథమిక అవగాహన కోసమే ఈ అధ్యయనం చేసినట్లు సీఎస్ఐఆర్ తెలిపింది. సీఎస్ఐఆర్ పరిధిలో దేశవ్యాప్తంగా 32 ప్రయోగశాలలు ఉండగా ఈ ప్రయోగశాలల్లో పని చేసే సిబ్బంది, వారి కుటుంబ సభ్యులపై ఈ అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనంలో 10,427 మంది పాల్గొనగా వీరిలో 10 శాతం మందికి ఇప్పటికే కరోనా సోకిందని వారు వైరస్ నుంచి కోలుకున్నారని తెలుస్తోంది. యాంటీబాడీ పరీక్షల నిర్వహణ ద్వారా శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు.

    జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువమంది కరోనా బారిన పడినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అధ్యయనంలో పాల్గొన్న వాళ్లలో మాంసాహారుల్లో 11 శాతం వరకు కరోనా వైరస్ వ్యాప్తిని గుర్తించిన శాస్త్రవేత్తలు శాఖాహారుల్లో 6.8 శాతం మంది మాత్రమే కరోనా బారిన పడినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తక్కువ స్పేస్ ఉన్న ఇళ్లలో నివశించిన వారికే ఎక్కువగా కరోనా సోకుతున్నట్టు తెలుస్తోంది.

    కరోనా సోకిన వారిలో బ్లడ్ గ్రూపుల వారీగా పరిశీలిస్తే ఎ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు ఎక్కువగా కరోనా బారిన పడుతుండగా ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు మాత్రం తక్కువగా కరోనా బారిన పడుతున్నట్టు తెలుస్తోంది. మరో 14 రోజుల్లో ఈ అధ్యయనానికి సంబంధించి సమగ్ర నివేదిక రానుందని తెలుస్తోంది.