
Nani Dasara Movie: న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘దసరా’ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ బాషలలో విడుదల కానుంది. నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఇది. ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్నాయి. ఈ సినిమా కూడా అదే బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు.
ఒక సున్నితమైన కథాంశం ని తీసుకొని ఎంతో వైవిద్యం గా తెరకెక్కించాడు అనే విషయం టీజర్ మరియు ట్రైలర్ ని చూస్తే అర్థం అయిపోతుంది.అందుకే ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ హీరో రేంజ్ లో జరిగాయి.ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా దాదాపుగా 50 కోట్ల రూపాయలకు జరిగినదని ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
అయితే ఇంత క్రేజ్ ని దక్కించుకున్న ఈ సినిమాని తొలుత నాని తో కాకుండా ఒక స్టార్ హీరో కోసం డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ప్రయత్నం చేసాడట.ఆ స్టార్ హీరో మరెవరో కాదు, మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

పుష్ప సినిమా ప్రారంభం కాకముందే ఆయనకీ ఈ కథని వినిపించాడట.కానీ అల్లు అర్జున్ అప్పటికే పుష్ప సినిమాకి కమిట్ అయిపోవడం వల్ల ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.అంతే కాదు కథ బాగా నచ్చేలోపు హీరో నాని కి కాల్ చేసి ఈ కథ వినమని అల్లు అర్జున్ రికమెండ్ చేసాడట.ఆ తర్వాత శ్రీకాంత్ నాని దగ్గరకి వెళ్లి కథ చెప్పడం, ఆయన ఈ కథ విని ఎంతో ఆనందించి వెంటనే ఓకే చెప్పడం అన్నీ ఇలా చకచకా జరిగిపోయాయి.అలా తెరకెక్కిన ఈ సినిమా రేపు ప్రేక్షాభిమానం అందుకుంటుందా లేదా అనేది చూడాలి.