Chiranjeevi- Allu Arjun: సోషల్ మీడియా లో గత కొంతకాలం గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరియు మెగా ఫ్యాన్స్ మధ్య పెద్ద ఫ్యాన్ వార్ నడుస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అల్లు అర్జున్ సోషల్ మీడియా ని బాగా గమనిస్తూ ఉన్నట్టు ఉన్నాడు. అందుకే ప్రతీ ఏడాది రామ్ చరణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసే అలవాటు ఉన్న అల్లు అర్జున్, ఈసారి మాత్రం చెయ్యలేదు.అంతే కాదు చిరంజీవి ఇంట్లో ఏర్పాటు చేసిన రామ్ చరణ్ ‘బర్త్ డే బాష్’ కి కూడా ఆయన హాజరు కాలేదు.
ఇవన్నీ పక్కన పెడితే #RRR చిత్రం లోని ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు రామ్ చరణ్ ని తక్కువ చేసి, జూనియర్ ఎన్టీఆర్ ని ఒక రేంజ్ లో లేపడం వంటివి మెగా ఫ్యాన్స్ కి బాగా కోపం రప్పించేలా చేసాయి. ఇక వీటి అన్నిటికి సమాధానం గా చిరంజీవి నేడు ట్విట్టర్ లో వేసిన ఒక ట్వీట్ అల్లు అర్జున్ కి చెంప దెబ్బ కొట్టినట్టు ఉందని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీ కి వచ్చి 20 ఏళ్ళు పూర్తి అయ్యాయి.ఈ సందర్భంగా అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు తెలియచేస్తూ చిరంజీవి ఒక పెద్ద ట్వీట్ వేసాడు. రామ్ చరణ్ ని ఒకసారి తక్కువ చేసినా,ఆయన పుట్టినరోజు ని అల్లు అర్జున్ ఏమాత్రం లెక్కచెయ్యకపోయిన కూడా చిరంజీవి సహృదయం తో అల్లు అర్జున్ కి విష్ చేయడాన్ని ఏమి సూచిస్తుంది అంటే,ఎంత ఎదిగినా మూలలను మర్చిపోకూడదు అనే విషయాన్నీ తెలియచేస్తుంది. చిరంజీవి ద్వారా పరిచయమైనా అల్లు అర్జున్ నేడు అల్లు కుటుంబం లేనిదే తాను లేను అంటూ చెప్పుకొస్తున్నాడు.
ఒకప్పుడు మెగా ఫ్యామిలీ లేనిదే నేను లేను అంటూ చెప్పుకొని తిరిగే అల్లు అర్జున్ లో సడన్ గా ఈ మార్పు రావడానికి కారణం ఆయనకీ వస్తున్నా విజయలవల్లేనా..?, విజయాలు ఆయనలో అహంకారం పెంచిందా..? ఇవన్నీ తప్పు అని నిరూపించుకునే ప్రయత్నం అల్లు అర్జున్ చేస్తాడా..? లేదా పట్టించుకోకుండా ముందుకు వెళ్లే ధోరణి తో ఉంటాడా అనేది చూడాలి.