Sheep In Jail: ప్రపంచంలో ఎన్నో వింతలు చోటుచేసుకుంటాయి. కొన్ని సార్లు మనం పెంచుకున్న జంతువులే మన పాలిట యముడిగా మారతాయి. వాటితో మన ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. ఎద్దులు పొడిచి చనిపోయిన వారున్నారు. గేదెలు దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయిన వారున్నారు. కానీ ఓ గొర్రె పొట్టేలు పొడవడంతో ఓ మహిళ ప్రాణాలు పోయాయి. అది విచక్షణారహితంగా దాడి చేయడంతో సదరు మహిళ ఆస్పత్రిలో కన్ను మూసింది. పక్కటెముకలు విరగడంతో ఆమె తుది శ్వాస విడిచింది. మనుషులతో కాకుండా జంతువులతో ప్రమాదాలు రావడం కొత్తేమీ కాదు. కానీ ఇలాంటి సంఘటనలు వింటేనే ఆశ్చర్యం వేస్తోంది.

ఆఫ్రికాలోని సౌత్ సూడాన్ లోని మాన్యాంగ్ ధాల్ లో ఈ దారుణం జరిగింది. అకుల్ యోల్ ప్రాంతంలో ఆదిల్ చాంపింగ్ (45) అనే మహిళపై ఓ గొర్రె పొట్టేలు దాడి చేసింది. కొమ్ములతో కుమ్మేసింది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా ఆమె మృతి చెందింది. దీంతో స్థానికులు సదరు పొట్టేలును దాని సంరక్షుడైన రామ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పొట్టేలు, రామ్ లను కోర్టులో హాజరు పరచడంతో పొట్టేలుకు మూడేళ్ల శిక్ష విధించారు. మహిళ మృతికి కారణమైన పొట్టేలుకు శిక్ష పడటంతో అందరు ఆశ్చర్యపోయారు.
Also Read: CM Jagan: వినేవారు విదేశీయులని.. ఏపీలో ఆరోగ్య పరిస్థితులపై గొప్పగా చెప్పిన జగన్

మూడేళ్ల శిక్ష కాలం పూర్తయిన తరువాత పొట్టేలును దాని యజమానికి అప్పగించాలని సూచించింది. పొట్టేలు తీరుకు అందరు సంశయిస్తున్నారు. మనిషి ప్రాణానికి రాక్షసుడిగా మారిన పొట్టేలును చూసి భయపడుతున్నారు. లోకంలో ఇలాంటి వింత తీర్పు ఇచ్చిన అక్కడి కోర్టు తీరుపై అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాంటి తీర్పు ఎక్కడ వినలేదు. ఇలా పొట్టేలు దాడి చేయడం వల్ల ఎవరు కూడా మరణించలేదు. ఆప్రికా లో చోటుచేసుకున్న ఈ వింతకు అందరు ఇదెక్కడి విడ్డూరమని చెప్పుకుంటున్నారు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. జంతువులకు శిక్ష వేయడం నిజంగా ఓ వింతే కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆఫ్రికాలో జరిగిన సంఘటనతో ఇదో అసాధారణమైనదిగా గుర్తిస్తున్నారు. జంతువులతో కూడా మనుషులకు ప్రమాదాలు ఉంటాయని తెలుస్తోంది. ఆ మధ్య ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తిని గేదె పొడిచి చంపింది. ఇప్పుడు పొట్టేలు పొడిచి చంపడం చూస్తుంటే మనుషుల ప్రాణాలకు జంతువులే మనుషుల పాలిట శత్రువులుగా మారుతున్నాయి. వాటి నుంచి రక్షించుకునే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే మరి.
Janhvi Kapoor: ‘జాన్వీ కపూర్’ కిల్లింగ్ లుక్.. అలా చేతులు వెనక్కి పెట్టి.. ఒళ్ళు విరవడం.. !
[…] […]