Daughter Killed Father: మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. వివాహేతర సంబంధాలు, ప్రేమ వివాహాలు మాటున అయిన వారినే కడతేర్చుతున్నారు. పరువు హత్యలకు పాల్పడుతున్నారు. తన ప్రేమ వివాహానికి అడ్డుగా నిలుస్తున్నాడని కన్నతండ్రినే ప్రియుడితో దారుణంగా హత్య చేయించింది ఓ యువతి. ఇందుకు తల్లి కూడా సహకరించింది. తన తండ్రిని ఎవరో దారుణంగా హత్యచేశారని కట్టు కథ అల్లి పోలీసులకు ఫిర్యాదుచేసింది. అయితే పోలీస్ విచారణలో కుమార్తె హత్య చేయించిందని నిరూపితమైంది. అటు తల్లి పాత్ర కూడా రుడీ అయ్యింది. ప్రస్తుతం ఆ యువతి, తల్లి, ప్రియుడు కటకటలపాలయ్యారు. కర్నాటక రాష్ట్రంలోని బెళగవి నగరంలో వెలుగుచూసింది ఈ ఘటన. ఇందుకు సంబంధించి ఎస్పీ సంజీవ్ పాటిల్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
బెళగవిలో సుధీర్ కాంబళే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. ఆయనకు భార్య రోహిణి, కుమార్తె స్నేహ ఉన్నారు. కొవిడ్ కు ముందు సుధీర్ దుబాయ్ లో ఉండేవారు. అక్కడే వ్యాపారాలు చేసుకొని బాగా సంపాదించారు. కొవిడ్ అనంతం బెళగవి వచ్చి రియల్ఎస్టేట్ వ్యాపారం తిరిగి ప్రారంభించారు. కుమార్తె స్నేహ మహారాష్ట్రలోని పుణెలో హోటల్ మేనేజ్ మెంట్ చదువుతోంది. అక్కడే అక్షయ్ విఠకర్ అనే యువకుడు పరిచయమయ్యాడు. స్నేహితులుగా ఉన్న వీరు ప్రేమికులుగా మారారు. ఒకర్ని విడిచి పెట్టి ఒకరు ఉండలేని స్థితిలోకి వచ్చారు. స్నేహ ప్రేమ వ్యవహారం తండ్రి సుధీర్ కు చెప్పింది. ఒప్పించే ప్రయత్నం చేసింది. దీనికి సుధీర్ ససెమిరా అన్నాడు. ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు.
Also Read: PFI Ban- Turkey: పీఎఫ్ఐ ని భారత్ నిషేధిస్తే టర్కీ కి ఎందుకు ఇబ్బంది?
అయితే భర్త సుధీర్ వ్యవహార శైలి భార్య రోహిణికి కూడా నచ్చలేదు. కుమార్తె ప్రేమ వ్యవహారాన్ని రోహిణి సపోర్టు చేసింది. సుధీర్ కు ఇద్దరూ ఒప్పించాలని ప్రయత్నించినా ఆయన వినలేదు. విసిగి వేశారిపోయిన వారిద్దరూ సుధీర్ ను చంపాలని డిసైడ్ అయ్యారు. ఇదే విషయాన్ని స్నేహ లవర్ విఠకర్ కు చెప్పంది. సెప్టెంబరు 15న బెళగవికి రప్పించింది. అక్కడే ఓ లాడ్జిలో రూమ్ బుక్ చేసి అక్కడే ఉంచింది. 17వ తేదీన సుధీర్ ఇంట్లో పై అంతస్తులో గాడ నిద్రలో ఉండగా విఠకర్ ను ఇంటికి రప్పించారు. కుమార్తె స్నేహ కాళ్లను పట్టుకోగా… భార్య రోహిణి చేతులను గట్టిగా పట్టుకుంది. విఠకర్ విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో సుధీర్ మృతిచెందాడు. వెంటనే విఠకర్ పుణే వెళ్లిపోయాడు. సుధీర్ ను ఎవరో దారుణంగా హత్యచేశారని తల్లీ కుమార్తెలు స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేశారు.
అయితే కేసు విచారణలో దృశ్యం సినిమా మాదిరిగా తల్లీ కూతుల్లిద్దరూ ఒకేలా సమాధానం చెబుతున్నారు. దీంతో అనుమానంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. స్నేహ ఫోన్ కాల్ లీస్టును పరిశీలించారు. ఆమె పదేపదే లవర్ విఠకర్ తో మాట్లాడడాన్ని గుర్తించారు. విఠకర్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించేసరికి నిజాలు బయట పడ్డాయి. కర్నాటక పోలీసులు ముగ్గుర్నీ అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. అయితే ప్రేమకు అడ్డుగా ఉన్నాడని తండ్రినే కుమార్తె హత్య చేయించడం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.
Also Read:Review On ACB Cases: ఏసీబీ కొరడా ఝుళిపించేందుకు రెడీ అయిన జగన్.. ఎవరికి మూడుతుందో?