Maruti Suzuki: కరోనా సమయంలో గిరాకీ లేక ఆటోమొబైల్ పరిశ్రమ బేల చూపులు చూసింది. ఇప్పుడు కోవిడ్ తగ్గు ముఖం పడుతుండడంతో తిరిగి పుంజుకుంటున్నది. మిగతా కంపెనీలేమో కానీ.. మారుతి సుజుకి మాత్రం కార్ల తయారీలో జెట్ స్పీడ్ వేగంతో దూసుకెళ్తోంది. తనకు అచ్చి వచ్చిన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ పోర్ట్ఫోలియోను ఈ ఏడాది మరింత ఏకీకృతం చేసింది. ఇదే సమయంలో ఎంట్రీ లెవెల్ స్పేస్ కూడా ఘనంగా ప్రారంభించింది. సుదీర్ఘ విరమణ తర్వాత సెలెరియో రెండవ వెర్షన్ ను మారుతి ఈ ఏడాది ప్రారంభంలో తీసుకువచ్చింది. తన అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రమైన బాలేనో సిరీస్ ను మరింతగా నవీకరించింది. దాని తర్వాత ఎర్టిగా ఎక్స్ఎల్ 6 కోసం మిడ్ లైఫ్ అనే ఫీచర్ ని అప్డేట్ చేసింది. దీనితోపాటు కొత్తతరం బ్రెజ్జాను తీసుకువచ్చింది. వాస్తవానికి బ్రేజా స్థానాన్ని టాటా నెక్సన్ ఆక్రమించింది. కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ విభాగంలో నెక్సాన్ దే అగ్రస్థానం. కానీ దానిని వెనక్కినెట్టి మారుతి సుజుకి బ్రెజ్జా అగ్రస్థానంలో నిలిచింది. గతంలో వచ్చిన మోడల్ కంటే దీనిని మరింత నవీకరించింది. ఈ మోడల్ లో తాజా ఫ్రెండ్ కు అనుగుణంగా 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, 360 డిగ్రీ కెమెరా సిస్టం, హెడ్స్ అఫ్ డిస్ప్లే, బహుళ ఎయిర్ బ్యాగులు, సన్ రూఫ్ వంటి విభాగాలను జోడించింది.

_ కొత్త తరం ఆల్టో ఆవిష్కరణ
తనకు కామధేనువు లాంటి ఆటో సిరీస్ లో కే టెన్ అనే మోడల్ ను పైకి తీసుకొచ్చింది. ఇండో జపనీస్ టెక్నాలజీతో దీనిని రూపొందించింది. ఎక్స్టీరియర్ తో పాటు ఇంక్రిమెంటల్ ఫీచర్లతో దీనిని తయారు చేసింది. ఈసారి ఇంటీరియర్ ను మరింత విశాలంగా రూపొందించింది. కేవలం మధ్యతరగతి ప్రజలనే లక్ష్యంగా చేసుకొని గ్రాండ్ విటారా ను రూపొందించింది. మధ్య తరగతి కుటుంబాలకు స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ఈ నమూనాను రూపొందించింది. గ్రాండ్ విటార ధర 10 నుంచి 19.65 లక్షల మధ్య లో లభ్యం అవుతున్నది. హ్యుందాయ్ క్రెటా, కియా సేల్టోస్, ఎంజీ ఆస్టర్, వి డబ్ల్యూ టైగన్, స్కోడా కుశాక్, నిస్సాన్ కిక్స్, లైక్ ల కు పోటీగా మారుతి సుజుకి ఈ రకాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది ఐదు సీటర్ల కెపాసిటీ తో ఉంటుంది. అంతర్గతంగా అభివృద్ధి చేసిన మైల్డ్ హైబ్రిడ్ కె 15 సి తో ఈ ఇంజన్ రూపొందించారు. ఇది లీటర్ పెట్రోల్ కు 28 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ విభాగంతో గత పది నెలల్లో ఏడు లాంచ్ లతో మారుతి సుజుకి ఆటోమొబైల్ పరిశ్రమలోనే రారాజుగా వెలుగొందుతోంది. ఇవే కాక పర్యావరణ పరిరక్షణ కోసం ఎస్ సి ఎన్ జి తో పాటు ఐదు డోర్ల జిమ్ని బాలెనో ఆధారిత స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ కూపే పైప్ లైన్ లో ఉన్నాయి.
Also Read: Review On ACB Cases: ఏసీబీ కొరడా ఝుళిపించేందుకు రెడీ అయిన జగన్.. ఎవరికి మూడుతుందో?
_ విక్రయాలు సాగుతున్నాయి ఇలా
పండుగల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో వాహనాల విక్రయాలు మరింత పుంజుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఆగస్టు సెప్టెంబర్ నెలలో 50.33% అమ్మకాలు పెరిగాయి. ఒక్క జూలై నెలలోనే 1,62, 462 కార్ల అమ్మకాలు జరిగాయి. దేశీయంగా 1,36,500 యూనిట్లు అమ్ముడైతే, 21,224 కార్లను విదేశాలకు ఎగుమతి చేసింది. గ తేడాది జూలైలో మారుతి సుజుకి కార్ల విక్రయాలు 1,08,064 మాత్రమే. అయితే గత నెలలో కంపాక్ట్ సెగ్మెంట్లో వ్యాగనార్, స్విఫ్ట్, సెలేరియో, ఇగ్నీస్, బాలెనో, డిజైర్, టూర్ – ఎస్ వేరియంట్ కార్లు 70,268 విక్రయాలు జరిగాయి. గత ఏడాది ఇవి 51,529 యూనిట్లకు మాత్రమే పరిమితం అయ్యాయి. మినీ సెగ్మెంట్ లో ఆల్టో, ఎస్ _ ప్రెస్సో సేల్స్ 17,258 నుంచి 19,685 యూనిట్లకు పెరిగాయి.

ఇక టాటా మోటార్స్ విషయానికి వస్తే గత ఏడాదితో పోలిస్తే గత నెలలో కార్ల విక్రయాలు 92 శాతం పెరిగాయి గత ఏడాది సెప్టెంబర్ నెలలో 28 వేల కార్లను విక్రయించిన టాటా మోటార్స్.. గత నెలలో అది 51, 981 యూనిట్లకు చేరింది. ఈ ఏడాది జూన్ నెల తో పోలిస్తే గత నెల కార్ల విక్రయాలలో 19 శాతం అభివృద్ధి నమోదు అయింది. జూన్ నెలలో 43, 704 కార్లను టాటా మోటార్స్ విక్రయించింది.దేశీయంగా హోండా కార్స్ విక్రయాలు 12 శాతం పెరిగాయి. గత ఏడాది జూలై మాసంలో 5,383 కార్లను కంపెనీ విక్రయించింది. ఈ ఏడాది జూలైలో సంఖ్య 6,055 కు చేరుకుంది.
Also Read:PFI Ban- Turkey: పీఎఫ్ఐ ని భారత్ నిషేధిస్తే టర్కీ కి ఎందుకు ఇబ్బంది?