https://oktelugu.com/

Ramya Krishnan: భర్త కంటే డైరెక్టరంటేనే ఇష్టం.. రమ్యకృష్ణ కామెంట్స్ వైరల్..

Ramya Krishnan: సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోయిన్లు డైరెక్టర్లను పెళ్లి చేసుకున్నారు. సినిమా తీసేటప్పుడు వీరి మధ్య సన్నిహితం ఏర్పడిన నేపథ్యంలో వారు ప్రేమలో పడి ఆ తరువాత పెళ్లి చేసుకుంటారు. అలా హీరోయిన్ రమ్యకృష్ణ, డైరెక్టర్ కృష్ణవంశీ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు కూడా ఉన్నారు. పెళ్లయిన తరువాత కూడా కృష్ణవంశీ డైరెక్షన్లో రమ్యకృష్ణ నటించింది. తాజాగా ‘రంగమార్తాండ’ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఈ సందర్భంగా రమ్యకృష్ణ, తన […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 25, 2023 / 11:30 AM IST
    Follow us on

    Ramya Krishnan

    Ramya Krishnan: సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోయిన్లు డైరెక్టర్లను పెళ్లి చేసుకున్నారు. సినిమా తీసేటప్పుడు వీరి మధ్య సన్నిహితం ఏర్పడిన నేపథ్యంలో వారు ప్రేమలో పడి ఆ తరువాత పెళ్లి చేసుకుంటారు. అలా హీరోయిన్ రమ్యకృష్ణ, డైరెక్టర్ కృష్ణవంశీ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు కూడా ఉన్నారు. పెళ్లయిన తరువాత కూడా కృష్ణవంశీ డైరెక్షన్లో రమ్యకృష్ణ నటించింది. తాజాగా ‘రంగమార్తాండ’ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఈ సందర్భంగా రమ్యకృష్ణ, తన భర్త కృష్ణ వంశీ గురించి హాట్ కామెంట్స్ చేశారు.

    టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఈ మధ్య సినిమాల్లో తక్కువ కనిపిస్తున్నారు కావచ్చు.. కానీ ఒకప్పుడు స్టార్ హీరోయిన్. అందచందాల హీరోయిన్ అంటే రమ్యకృష్ణ గురించే ఎక్కువగా చెప్పేవారు. 1990 దశకంలో ఆమె కోసం సీనియర్ హీరోలు క్యూ కట్టాల్సిన పరిస్థితి. ఆ తరువాత రమ్యకృష్ణ క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పించింది. రాజమౌళి తీసిన ‘బాహుబలి’ సినిమాలో హీరో ప్రభాస్ తరువాత ఆమెకు ఎక్కువ మార్కులు పడ్డాయని చెప్పొచ్చు. అప్పటి నుంచి ఈమె సినిమాల్లో తక్కువగా కనిపిస్తోంది. ఇటీవల కృష్ణ వంశీ డైరెక్షన్లో వచ్చిన ‘రంగమార్తాండ’ మూవీలో కీలక రోల్ లో నటించింది.

    ఈ సందర్భంగా రమ్యకృష్ణ తన భర్త కృష్ణవంశీ గురించి మాట్లాడారు. తన అనుభవంలో కృష్ణ వంశీ గురించి ఎంతో తెలుసుకున్నానని అన్నారు. ఒక యాక్టర్ నుంచి ఎంత నటన తీసుకోవాలో ఆయనకు తెలుసని అన్నారు. కృష్ణ వంశీ డైరెక్షన్ కింద పనిచేయడం ఎంజాయ్ చేస్తానని అన్నారు. డైలాగ్ డెలవవరీ, ఎలా ప్రవర్తించాలనేది వివరించి చెబుతారని అన్నారు. తాను ఇప్పటి వరకు పనిచేసిన డైరెక్టర్లందితో కలిసి పనిచేసిన దాని కంటే కృష్ణ వంశీ సినిమాల్లో పనిచేయడం అద్భుతం అని వర్ణించారు.

    Ramya Krishnan

    ఇక భర్తగా.. లేక డైరెక్టర్ గా కృష్ణవంశీ ఎలా నచ్చుతాడని అడిగితే డైరెక్టర్ గానే ఎక్కువ ఇష్టపడుతానని అన్నారు. తనకు భర్తగా కంటే డైరెక్షన్లో పనిచేయడానికి మాత్రమే చాలా ఇష్టమని అన్నారు. అయితే గతంలో కృష్ణవంశీ సైతం తనను రమ్యకృష్న భరిస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని యాంకర్ గుర్తు చేయగా.. అవునని రమ్యకృష్ణ సమాధానం ఇచ్చారు. 1998లో చంద్రలేఖ సినిమాతో రమ్యకృష్ణ, కృష్ణవంశీలు లు ప్రేమించుకున్నారు. ఆ తరువాత 2003లో వీరు పెళ్లి చేసుకున్నారు.