
Allu Arjun Daughter Arha: అల్లు అర్జున్ కూతురు అర్హపై శాకుంతలం దర్శకుడు గుణశేఖర్ ప్రశంసలు కురిపించారు. శాకుంతలంలో అర్హ అద్భుతంగా నటించిందంటూ కొనియాడారు. ఈ సందర్భంగా బన్నీని కూడా పొగడ్తలతో ముంచెత్తారు. శాకుంతలం మూవీ 3డీ ట్రైలర్ విడుదల సందర్భంగా యూనిట్ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఓ విలేకరి… అర్హ పాత్ర నిడివి ఎంత ఉంటుందని అడిగారు. అల్లు అర్జున్ పాత్ర 15 నిమిషాలు ఉంటుంది. చివర్లో ఎంట్రీ ఇస్తుంది. ఆ పదిహేను నిమిషాలు బాగా చేసింది. తండ్రి అల్లు అర్జున్ ని తలపించింది అన్నారు.
అల్లు అర్హ తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది. తనకు ఇంగ్లీష్ అసలు రాదు. ఈ జనరేషన్ లో పిల్లలకు ఇంగ్లీష్ నేర్పకపోవడమంటే ఊహించని పరిణామం. అల్లు అర్జున్ కి మాతృ భాష మీద ప్రేమ అలాంటిది. తన కూతురికి అచ్చ తెలుగు ఆయన నేర్పించారు. ఆ రోజు రుద్రమదేవి చేస్తున్నప్పుడు నాకు చాలా బాగా సప్పోర్ట్ చేశారు. గోన గన్నారెడ్డి పాత్రకు అడగగానే ఒప్పుకున్నారు. ఈ రోజు శాకుంతలంకి కూతురుని ఇచ్చి మరింత మద్దతు తెలిపారు. భరతుడు పాత్ర స్టార్ కిడ్ చేస్తే బాగుంటుందని అనుకున్నాము. ఇంస్టాగ్రామ్ లో అర్హ పిక్స్ చూసి ఎంపిక చేశాము.
కోవిడ్ సమయంలో అర్హను శాకుంతలం షూటింగ్ కి పంపారు. ఐకాన్ స్టార్ ఊరికే కారు. ఆయన గొప్ప హీరోనే కాకుండా, ఉన్నతమైన భావాలు కలవాడు… అంటూ అల్లు అర్జున్ ని ఉద్దేశిస్తూ గుణశేఖర్ మాట్లాడారు. శాకుంతలం ఏప్రిల్ 4న వరల్డ్ వైడ్ 5 భాషల్లో విడుదల కానుంది. దిల్ రాజు, గుణశేఖర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు.

సమంత విశ్వామిత్ర మహర్షి కూతురు శకుంతలగా కనిపించనుంది. ఆమెకు జంటగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. విలక్షణ నటుడు మోహన్ బాబు కీలకమైన దుర్వాస మహర్షి రోల్ చేస్తున్నారు. కేవలం సమంత ఫేమ్ మీద ఈ చిత్రం ఆడాల్సి ఉంది. మూవీ మీద చెప్పుకోదగ్గ బజ్ క్రియేట్ కాలేదు. కనీసం మంచి ఓపెనింగ్స్ అయినా రాబట్టాలని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్స్ లోకి వస్తుంది. సమంత గత చిత్రం యశోద హిట్ టాక్ తెచ్చుకుంది. మరి శకుంతల ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.