
Ravi Teja: మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం మామూలు ఊపు లో లేదు. క్రాక్ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వరుసగా రెండు డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకొని కెరీర్ లో ఘోరమైన స్లంప్ ఫేస్ ని ఎదురుకున్న రవితేజ,ఆ తర్వాత ‘ధమాకా’ చిత్రం తో మరోసారి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది.
ఇక ఆ సినిమా తర్వాత వెంటనే మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం లో నటించి మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన చేసిన ‘రావణాసుర’ చిత్రం ఏప్రిల్ 7 వ తారీఖున విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఆ సినిమా ప్రొమోషన్స్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు రవితేజ.
అయితే ఈ సినిమా తో పాటుగా ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’.ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ బాషలలో ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 20 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నారు. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది, అదెంటిటంటే అదే రోజు రామ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కూడా విడుదల కాబోతుంది.

ఈమధ్యనే అందుకు సంబంధించిన పోస్టర్ ని విడుదల చేసి, సినిమా విడుదల తేదీని కూడా ఖరారు చేసారు. రెండు భారీ సినిమాలే, రెండు చిత్రాలకు కూడా 50 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ లు జరిగే రేంజ్ ఉంది. ఇలా ఒకే రోజు క్లాష్ పడితే మాత్రం రెండు సినిమాలకు నష్టమే అని అంటున్నారు విశ్లేషకులు. మరి రాబొయ్యే రోజుల్లో ఎదో ఒక సినిమా ముందుకు వెళ్లడమో, లేదా వెనక్కి వెళ్లడమో జరుగుతుందో లేదో చూద్దాము.