
Shakuntalam OTT: సమంత ప్రధాన పాత్రలో ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘శాకుంతలం’ అనే చిత్రం నిన్న పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా విడుదల అయ్యింది. గుణ టీం వర్క్స్ మరియు దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. నాసిరకమైన విజువల్ ఎఫెక్ట్స్ తో ఆడియన్స్ కి చిరాకు కలిగించారని, టేకింగ్ విషయం లో కూడా ఇది గుణ శేఖర్ కెరీర్ లోనే బలహీనమైన వర్క్ అని సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు పెదవి విరిచారు.
దాంతో ఈ చిత్రానికి ఘోరమైన ఓపెనింగ్ వచ్చింది. మొదటి రోజు ఈ చిత్రానికి 5 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చిందని మూవీ టీం నుండి అందిన ఫేక్ ప్రచారం కానీ, నిజంగా అయితే కనీసం మూడు కోట్ల రూపాయిల గ్రాస్ ని కూడా వసూలు చేసి ఉండదని అంటున్నారు.
బాక్స్ ఆఫీస్ ఇలాంటి చేదు అనుభవం ని దక్కించుకున్న ఈ సినిమా మేకర్స్ కి అమెజాన్ ప్రైమ్ సంస్థ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ముందుగా అగ్రిమెంట్ లో అనుకున్న డేట్ కంటే ముందు ఈ సినిమాని విడుదల చేసుకునేందుకు అనుమతి ని ఇస్తే 20 కోట్ల రూపాయిలు అదనంగా ఇస్తామని చెప్తున్నారట. బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాగో రన్ ఉండదు, ఈ ఒప్పందం ఒప్పుకొని ముందుకు పోతే నష్టమైనా తగ్గుతుంది అని దిల్ రాజు ఒక నిర్ణయానికి వచ్చి ముందుగా విడుదల చేసుకునేందుకు అనుమతిని ఇచ్చాడట.

దాంతో ఈ సినిమా ఈ నెలాఖరున కానీ,లేదా వచ్చే నెల మొదటి వారం లో కానీ ఓటీటీ లో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది.ఈ సినిమాని థియేటర్స్ లో జనాలు ఆదరించకపోవచ్చు కానీ, మహాభారతం కి సంబంధించిన స్టోరీ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా చూస్తారని, అందుకే ఈ ఆఫర్ ని మేకర్స్ కి అమెజాన్ ప్రైమ్ సంస్థ వారు ఇచ్చినట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్.