
Ram Charan- Shah Rukh Khan: ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ మామూలు రేంజ్ లో లేదు.#RRR చిత్రం తో ఆయన తన రేంజ్ ని పాన్ ఇండియా నుండి పాన్ వరల్డ్ కి పెంచేసుకున్నాడు. ఎక్కడ చూసినా ఇప్పుడు రామ్ చరణ్ జపమే కనిపిస్తుంది. ఒక టాలీవుడ్ హీరో గురించి నేషనల్ వైడ్ గా మాట్లాడుకుంటూనే ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం, అలాంటి పాన్ వరల్డ్ రేంజ్ లో ఒక స్టార్ తెలుగు హీరో గురించి మాట్లాడుకుంటున్నారు అంటే, రామ్ చరణ్ ఎదుగుదల ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీ కి మాత్రమే పరిమితం అయ్యాడు, కానీ రామ్ చరణ్ కి మాత్రం బౌండరీలు లేకుండా పోయింది. అలా తండ్రిని మించిన తనయుడిగా రామ్ చరణ్ ఎదిగినందుకు అభిమానులు ఎంతో గర్వపడుతున్నారు. ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ రేంజ్ ఎలాంటిదో చెప్పడానికి ఇప్పుడు మరో ఉదాహరణ ఎదురైంది.
అసలు విషయానికి వస్తే ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న నటుడు షారుఖ్ ఖాన్.రీసెంట్ గానే ఆయన ‘పఠాన్’ మూవీ తో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టాడు. ఇప్పుడు ఆయన లేటెస్ట్ గా ‘జవాన్’ అనే సినిమా చేస్తున్నాడు, ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం తో షారుఖ్ ఖాన్ మన సౌత్ మార్కెట్ మీద కూడా కన్ను వేసాడు, అందుకోసం మూవీ లో ఒక కీలక పాత్ర కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని తీసుకుంటే సౌత్ లో కలెక్షన్స్ బాగా కలిసి వస్తాయనే ఉద్దేశ్యం తోనే షారుఖ్ ఖాన్ చరణ్ ని ఎంచుకున్నాడు.

ఆయన డేట్స్ ఇప్పుడు అడ్జస్ట్ కాకపోతే చరణ్ కోసం వేచి చూస్తూ, అవసరం అయితే మూవీ విడుదల తేదీన వాయిదా వేయించడానికి కూడా వెనుకాడట్లేదు షారుఖ్ ఖాన్ , అంత పెద్ద సూపర్ స్టార్ రామ్ చరణ్ కోసం ఇలా ఎదురు చూడడం పై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు.