Bike Ride: షోషల్ మీడియాతో అనామకులు కూడా ఓవర్‌నైట్ స్టార్ అవుతున్నారు. ఏళ్లుగా బయటకు రాని టాలెంట్ ప్రపంచానికి పరిచయం అవుతోంది. దీంతో యువతతోపాటు చాలా మంది తమలోని టాలెంట్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచానికి తమ టాలెంట్‌ను పరిచయం చేస్తున్నారు. అయితే కొంతమంది రీల్స్ కోసం, లైక్ అండ్ షేర్స్ కోసం ప్రమాదకరమైన ఫీట్స్ కూడా చేస్తున్నారు. ప్రమాదాలబారిన పడుతున్నారు. తాజాగా ఏడుగురు కూడా ప్రమాదకరమైన ఫీట్ చేశారు.
ఒకే బైక్‌పై ఏడుగురు..
సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అవ్వడానికి ఏడుగురు వ్యక్తులు తమ జీవితాలను రిస్క్‌లో పెట్టుకుని స్టంట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లా కతిఖేరా ప్రాంతానికి చెందిన ఈ ఏడుగురు యువకులు ఒకే బైక్‌పై ఎక్కి నడిరోడ్డుపై నడిపారు. అందులో ఆరుగురు వ్యక్తులు బైక్‌పై కూర్చోగా.. మరో యువకుడు బైక్ నడుపుతున్న వ్యక్తి భుజాలపై కూర్చోని ఉన్నాడు.
సోషల్ మీడియాలో వైరల్..
ఈ ఫీట్‌ను షూర్ చేయించిన సదరు యువకులు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోను చూసిన నెటిజన్లు పోతార్రా.. బతకాలని లేదా.. పోయేకాలం వస్తే ఇలాగే ఉంటది.. పోలీసులూ వీళ్ల పని పట్టండి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంతలో ఈ వీడియో పోలీసుల కంట్లో పడింది. దీంతో బండి నంబర్ ఆధారంగా .. బైక్ యజమానికి రూ.16 వేల జరిమానా విధించారు. అలాగే ఆ యువకులను స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
ఒక్క బైక్‌పై ఏడుగురు ప్రయాణమా?
ఉత్తరప్రదేశ్‌లోని హపూర్ జిల్లాలో జరిగిందీ సంఘటన. ద్విచక్రవాహనాలపై ఇలాంటి ప్రయాణాలు యమ డేంజర్. ఏమాత్రం తేడా వచ్చిన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర ప్రయాణాలు చేయడం సరికాదు. బైక్‌లపై ఇద్దరు కంటే ఎక్కువమంది ప్రయాణించడం… pic.twitter.com/O9f6Ll7ekf
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) August 9, 2023