Waltair Veerayya Sridevi Song: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న విషయం తెలిసిందే..ఈ సినిమా కోసం మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు..చిరంజీవి ని చాలా కాలం తర్వాత ఊర మాస్ రోల్ లో చూడబోతున్నాం అనే ఆత్రుత వారిలో కనిపిస్తుంది.

ఇక మాస్ మహారాజ రవితేజ కూడా ఈ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషించడం తో ట్రేడ్ లో ఈ సినిమా పై బజ్ మాములు రేంజ్ లో లేదు..సంక్రాంతి కి ఎన్ని సినిమాలు వచ్చిన మెగాస్టార్ తొక్కుకుంటూ వెళ్ళిపోతాడని అభిమానులు గట్టి నమ్మకం తో చెప్తున్నారు..ఇప్పటికే ఈ సినిమా కి సంబంధించి విడుదలైన రెండు టీజర్స్ మరియు ‘బాస్ పార్టీ’ సాంగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది..ముఖ్యంగా బాస్ పార్టీ సాంగ్ ఇప్పుడు ఎక్కడ చూసిన మారుమోగిపోతుంది.
మొదటి పాట బంపర్ హిట్ అవ్వడం తో రెండవ పాట పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి..’నువ్వు శ్రీదేవి అయితే..నేను చిరంజీవి అంట’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో సాంగ్ ని ఈరోజు విడుదల చేసారు..దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్ పర్వాలేదు అనే రేంజ్ లో ఉన్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి గ్రేస్ తో కూడా అద్భుతమైన డ్యాన్స్ స్టెప్స్ వెయ్యడం తో యావరేజి అవ్వాల్సిన పాట సూపర్ హిట్ అయిపోయింది..మొదటిసారి విన్నప్పుడు ఏ సాంగ్ అయినా అలాగే అనిపిస్తుంది.

‘బాస్ పార్టీ’ సాంగ్ విడుదల అప్పుడు కూడా డివైడ్ రెస్పాన్స్ వచ్చింది..కానీ ఈరోజు ఆ సాంగ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మనం చూసాము..ఈ సాంగ్ కూడా అదే రేంజ్ లో అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు..చిరంజీవి ఇలాంటి స్టెప్స్ వేసి చాలా కాలం అయ్యిందని..అభిమానులకు ఈ పాట సిల్వర్ స్క్రీన్ పై ఫీస్ట్ లాగ ఉండబోతుందని అభిమానులు సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.