FIFA World Cup France: ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ అసోసియేషన్ (ఫిఫా) ప్రపంచ కప్ 2022 ముగింపు దశకు వచ్చేసింది. ఫైనల్ లో ఫ్రాన్స్, అర్జెంటీనా తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో విజయమెవరిదో తేలనుంది. నాటకీయ పరిణామాల మధ్య రెండు జట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఆద్యంతం ఆసక్తి కరంగా ఫైనల్ మ్యాచ్ సాగనుంది. దీనికి వేదిక ఖతర్ కానుంది. ఇక్కడి లుసెయిల్ స్టేడియంలో సాకర్ కప్ సంరంభం ముగియనుంది. హేమాహేమీల్లాంటి జట్లు వెనుదిరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ పై అందరికి అంచనాలు పెరుగుతున్నాయి.

మొదటి నుంచి రెండు జట్లు హాట్ ఫేవరేట్లుగానే నిలిచాయి. లీగ్స్ దశల నుంచి ఫైనల్ వరకు ఆద్యంతం ఉత్కంఠభరితంగా విజయాలు సాధిస్తూ ఇక్కడికి వచ్చాయి. రెండు జట్లు తమ ప్రత్యర్థి జట్లపై కొదమసింహాల్లాగా గర్జించాయి. ప్రస్తుతం పరస్పరం ఢీకొని ఏది కప్ గెలుస్తుందో అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. రెండు జట్ల మీద అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మ్యాచ్ చాలా మందికి చివరి మ్యాచ్ కానుంది. దీంతో విజయం సాధించి తమ దేశానికి కానుక అందించాలని ఉవ్విళ్లూరుతున్నారు.
ఫ్రాన్స్ వైపు 33, అర్జెంటీనా వైపు 37 శాతం అభిమానులు ఫేవరేట్లుగా ఉన్నారు. ఎక్స్ ట్రా టైమ్ వైపు 30 శాతం మంది ఉన్నారు. 90 నిమిషాల నిడివితో జరిగే పోరులో ఏ జట్టు విజయం సాధిస్తుందోనని ఎదురు చూస్తున్నారు. సాకర్ సందర్భంగా ఆటగాళ్లకు ఓ బంపర్ ఆఫర్ సైతం వచ్చేసింది. ఫ్రాన్స్ ఆటగాళ్లకు ఆ దేశానికి చెందిన సెక్స్ వర్కర్లు ఇచ్చిన ఆఫర్ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ మ్యాచ్ లో అర్జెంటీనాను ఓడిస్తే వారికి తమ బెడ్ షేర్ చేస్తామని ప్రకటించడం విశేషం. సెమీ ఫైనల్ లో మొరాకోను చిత్తు చేసిన మరుసటి రోజే ఫ్రాన్స్ సెక్స్ వర్కర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో ఇరు జట్ల మధ్య పోరు రసవత్తరంగా మారనుంది. కప్ కోసం ఇరు జట్లు సమ ఉజ్జీలుగా నిలబడ్డాయి. కప్ తమకంటే తమకే అనే ధీమాలో ఉన్నారు. తమ దేశానికి కానుకగా అందించాలని ఆరాటపడుతున్నాయి. ఫ్రాన్స్ సెక్స్ వర్కర్లు ఇచ్చిన బూస్ట్ తో ఆటగాళ్లు చెలరేగుతారో లేక అర్జెంటీనా చేతిలో ఓటమి పాలవుతారో తెలియడం లేదు. మొత్తానికి వారికి వచ్చిన బంపర్ ఆఫర్ తో వారి ఆటతీరు జోరందుకోనుందని చెబుతున్నారు. ఏది ఏమైనా సాకర్ కప్ ను కైవసం చేసుకోవాలని ఇరు జట్లు హోరాహోరీగా పోరాటం మాత్రం చేయనున్నాయి.