https://oktelugu.com/

Venkatesh Maha On KGF2: ‘వాడో నీచ్ కమీన్ కొత్తే’ అదేం సినిమా… కెజిఎఫ్ డైరెక్టర్ పై కంచరపాలెం డైరెక్టర్ సంచలన కామెంట్స్

Venkatesh Maha On KGF2: దర్శకుడు వెంకటేష్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. కెజిఎఫ్ 2ని ఒక చెత్త చిత్రంగా అభివర్ణించాడు. ఆ చిత్ర కథ, హీరో క్యారెక్టరైజేషన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వెంకటేష్ మహా సినిమా పేరు చెప్పకుండా చేసిన ఈ కామెంట్స్ ప్రకంపనలు రేపుతున్నాయి. సీనియర్ యాంకర్ ప్రేమ… టాలీవుడ్ డైరెక్టర్స్ తో చిట్ చాట్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. శివ నిర్వాణ, మోహన కృష్ణ ఇంద్రగంటి, వెంకటేష్ మహ, నందిని రెడ్డి పాల్గొన్నారు. […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : March 6, 2023 / 11:38 AM IST
    Follow us on

    Venkatesh Maha On KGF2

    Venkatesh Maha On KGF2: దర్శకుడు వెంకటేష్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. కెజిఎఫ్ 2ని ఒక చెత్త చిత్రంగా అభివర్ణించాడు. ఆ చిత్ర కథ, హీరో క్యారెక్టరైజేషన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వెంకటేష్ మహా సినిమా పేరు చెప్పకుండా చేసిన ఈ కామెంట్స్ ప్రకంపనలు రేపుతున్నాయి. సీనియర్ యాంకర్ ప్రేమ… టాలీవుడ్ డైరెక్టర్స్ తో చిట్ చాట్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. శివ నిర్వాణ, మోహన కృష్ణ ఇంద్రగంటి, వెంకటేష్ మహ, నందిని రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఒక చెత్త సినిమాకు జనాలు బ్రహ్మరథం పట్టారని అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన పరుష వ్యాఖ్యలు చేశారు.

    వెంకటేష్ మహ మాట్లాడుతూ… నేను సినిమా పేరు చెప్పను. ఇటీవల విడుదలైన ఓ మూవీలో తల్లి హీరోని ఒక కోరిక కోరుతుంది. నువ్వు బాగా బంగారం సంపాదించి ధనవంతుడు కావాలి అంటుంది. హీరో జనాలతో గనులు తవ్వించి బంగారం బయటకు తీస్తాడు. తల్లి మాట ప్రకారం ఈ నీచ్ కమీన్ కుత్తే కష్టపడి బంగారం తవ్విన జనాలకు ఇందిరమ్మ ఇళ్ళు కట్టించి, బంగారం మొత్తం సముద్రం పాలు చేస్తాడు. అసలు ఏ నీచ్ కమీన్ కుత్తే అయినా ఇలాంటి పని చేస్తాడా? ఇదో గొప్ప కథా? అని ప్రశ్నించాడు.

    దర్శకుడు ప్రశాంత్ నీల్ టార్గెట్ గా వెంకటేష్ మహా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కెజిఎఫ్ అభిమానులు వెంకటేష్ మహను ఏకిపారేస్తున్నారు. ఆయన కామెంట్స్ ని ఖండిస్తున్నారు. 2018లో విడుదలైన కెజిఫ్ ఆదరణ దక్కించుకుంది దానికి సీక్వెల్ గా 2022లో విడుదలైన కెజిఎఫ్ 2 రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లతో ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక వెంకటేష్ మహ కేరాఫ్ కంచరపాలెం మూవీతో దర్శకుడు అయ్యాడు. ఆ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

    Venkatesh Maha On KGF2

    కేరాఫ్ కంచరపాలెం మూవీ ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. తర్వాత ఉమామహేశ్వర ఉగ్రరూపస్య టైటిల్ తో మలయాళ హిట్ రీమేక్ చేశారు. సత్యదేవ్ హీరోగా నటించిన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య అంతగా ఆడలేదు. మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే యాంథాలజీ సిరీస్ చేశారు. నటుడిగా పలు చిత్రాల్లో నటించారు. తనను సెన్సిబుల్ డైరెక్టర్స్ అభివర్ణించుకున్న వెంకటేష్ మహ… ప్రశాంత్ నీల్ ఒక చెత్త డైరెక్టర్ అనే కోణంలో మాట్లాడారు.

    Tags