
Anasuya: లెజెండరీ కామెడీ షో జబర్దస్త్ ఎందరికో జీవితాలు ఇచ్చింది. ముక్కూ ముఖం తెలియని వాళ్ళను స్టార్స్ చేసింది. వారిలో అనసూయ కూడా ఒకరు. నటిగా ఎదగాలన్న కోరికతో అనసూయ పరిశ్రమకు వచ్చారు. అది అంత ఈజీ కాదని తెలుసుకుని యాంకర్ అవతారం ఎత్తారు. 2013లో ప్రయోగాత్మకంగా జబర్దస్త్ షో స్టార్ట్ చేశారు. టిల్లు వేణు, ధనాధన్ ధన్ రాజ్, చలాకీ చంటి, రాకెట్ రాఘవ, రోలర్ రఘు, షకలక శంకర్, చమ్మక్ చంద్ర వంటి కమెడియన్స్ టీమ్ లీడర్స్ గా, రోజా, నాగబాబు జడ్జెస్ గా షో మొదలైంది. ఆడిషన్స్ లో అనసూయ సెలెక్ట్ అయ్యారు.
జబర్దస్త్ ఊహించని సక్సెస్ సాధించింది. అనసూయ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆమె స్టార్ యాంకర్ అయ్యారు. ఆ ఫేమ్ తో నటిగా, హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకున్నారు. 2022లో అనసూయ జబర్దస్త్ మానేశారు. హెవీ షెడ్యూల్స్ కారణంగా జబర్దస్త్ వదిలేస్తున్నట్లు ఆమె వివరణ ఇచ్చారు. అలాగే చిన్న ఆరోపణ చేయడం జరిగింది. జబర్దస్త్ కమెడియన్స్ బాడీ షేమింగ్ కి పాల్పడతారు. అది నాకు నచ్చడం లేదన్నారు.

తాజాగా ఆమె చేసిన కామెంట్ సంచలనమైంది. ఫ్యాన్స్ తో ఆన్లైన్ చాట్ చేసిన అనసూయ… యాంకరింగ్ ఎందుకు మానేశారు? మళ్ళీ ఎప్పుడు బుల్లితెరకు వస్తారు? అని ఒక అభిమాని అడిగారు. ఈ ప్రశ్నకు అనసూయ పరుష వ్యాఖ్యలు చేశారు. బుల్లితెర షోల నిర్వాహకులు అవమానకర చెత్త టీఆర్పీ స్టంట్స్ కి పాల్పడుతున్నారు. టెలివిజన్ ప్రోగ్రామ్స్ లో అలాంటి అనారోగ్యకర వాతావరణం పోయిన రోజు నేను తిరిగి యాంకరింగ్ చేస్తానని కామెంట్ పెట్టారు. పరోక్షంగా జబర్దస్త్ లో టీఆర్పీ కోసం చెత్త పనులు చేయాల్సి వస్తుంది. అది నచ్చకే వదిలేశానంటూ చెప్పకనే చెప్పారు.
ప్రస్తుతం అనసూయ దృష్టి మొత్తం నటనపైనే. అటు ఫేమ్ ఇటు ఇన్కమ్ దండిగా సమకూరుతుంది. అనసూయ నటిగా నిలదొక్కుకున్నారు. ఓ తరహా పాత్రలకు ఆమె బాగా సెట్ అవుతున్నారు. అనసూయ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇటీవల అనసూయ నటించిన ఖిలాడి, దర్జా, మైఖేల్ చిత్రాలు విడుదలయ్యాయి. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో ఆమె కీలక రోల్ చేస్తున్నారు. అలాగే పుష్ప సీక్వెల్ లో దాక్షాయణిగా మరోసారి అలరించనున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటున్నారు. బుల్లితెర ఆడియన్స్ ఆమెను బాగా మిస్ అవుతున్నారు.
Also Read: Aditi Rao Hydari: ఆ స్టార్ హీరోతో సహజీవనంలో అలా ఎంజాయ్ చేయడం నాకెంతో ఇష్టమన్న హీరోయిన్