https://oktelugu.com/

Amitabh Bachchan: బ్రేకింగ్ : ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ షూటింగ్ లో అమితాబ్ బచ్చన్ కి తీవ్ర గాయాలు..అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు

Amitabh Bachchan: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న పాన్ ఇండియన్ మూవీస్ లో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్ K’.మహానటి వంటి ఆల్ టైం క్లాసిక్ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన నాగ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.టైం ట్రావెల్ సబ్జెక్టు మీద తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం సుమారుగా 500 కోట్ల రూపాయిల వరకు ఖర్చు చేస్తున్నారు.ఇందులో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తుండగా, బాలీవుడ్ సూపర్ స్టార్ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 6, 2023 / 11:27 AM IST
    Follow us on

    Amitabh Bachchan

    Amitabh Bachchan: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న పాన్ ఇండియన్ మూవీస్ లో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్ K’.మహానటి వంటి ఆల్ టైం క్లాసిక్ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన నాగ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.టైం ట్రావెల్ సబ్జెక్టు మీద తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం సుమారుగా 500 కోట్ల రూపాయిల వరకు ఖర్చు చేస్తున్నారు.ఇందులో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తుండగా, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

    Also Read: Rajamouli- NTR: ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఈడు దొరికాడేంటి అనుకున్నా… ఎన్టీఆర్ పై రాజమౌళి దారుణ కామెంట్స్!

    ఇప్పటికే అధిక శాతం షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ప్రస్తుతం ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ గత కొద్ది రోజుల నుండి హైదరాబాద్ లో విరామం లేకుండా కొనసాగుతుంది.ప్రభాస్ తో పాటుగా అమితాబ్ బచ్చన్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు.

    ఇది ఇలా ఉండగా ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ లో తెరకెక్కిస్తున్న యాక్షన్ సన్నివేశం పాల్గొంటున్న అమితాబ్ బచ్చన్ కి తీవ్రమైన గాయాలు అయ్యాయి.దీనితో వెంటనే ఆయనని హైదరాబాద్ లోని AIG హాస్పిటల్స్ కి తరలించి అత్యవసర చికిత్స అందించారు.అమితాబ్ గారి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని, కానీ కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి అని ఈ సందర్భంగా డాక్టర్లు తెలియజెయ్యడం తో షూటింగ్ ని కొంతకాలం వరకు వాయిదా వేశారు.

    Amitabh Bachchan

    అమితాబ్ బచ్చన్ మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యవంతుడై వచ్చిన తర్వాతనే షూటింగ్ ని ప్రారంభిస్తామని ఈ సందర్భంగా డైరెక్టర్ నాగ అశ్విన్ తెలిపాడు.ఊపిరి తీసుకోవడం లోను , కదలడం లోను చాలా ఇబ్బందిగా ఉందని, అయితే అభిమానులు తన ఆరోగ్యం పట్ల ఏమాత్రం భయాందోళనకు గురి అవ్వాల్సిన అవసరం లేదని, తొందరగానే కోలుకొని మీ ముందుకు వస్తాను అంటూ అమితాబ్ బచ్చన్ ఈ సందర్భంగా తెలిపారు.

    Also Read:Aditi Rao Hydari: ఆ స్టార్ హీరోతో సహజీవనంలో అలా ఎంజాయ్ చేయడం నాకెంతో ఇష్టమన్న హీరోయిన్