spot_img
Homeట్రెండింగ్ న్యూస్Vizag: చనిపోతున్నామంటూ సెల్ఫీ.. వీడియో బంధువులకు పంపి దంపతుల అదృశ్యం

Vizag: చనిపోతున్నామంటూ సెల్ఫీ.. వీడియో బంధువులకు పంపి దంపతుల అదృశ్యం

Vizag
Varaprasad, Meera

Vizag: సమస్యలు చుట్టు ముట్టినప్పుడు.. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొలేక చాలా మంది ఆత్మహత్య శరణ్యం అనుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం పిల్లల అనారోగ్య సమస్యలు భరించలేక సాఫ్ట్‌వేర్‌ దపంతులు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఆత్మహత్య చేసుకున్నారు. అది మర్చిపోకముందే.. విశాఖపట్నంలో ఆర్థిక ఇబ్బందులు భరించలేక దంపతులు ఆత్మహత్య చేసుకుంటామంటూ సెల్ఫీ వీడియో తీసుకుని కనిపించకుండా పోయారు.

స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగి.. ఆర్థిక ఇబ్బందులు..
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా వడ్లపూడి తిరుమలనగర్‌కు చెందిన వరప్రసాద్‌(47), మీరా(41) దంపతులు. వరప్రసాద్‌ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగి. గతకొద్ది రోజులుగా వీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నామని, పిల్లలను బాగా చూసుకోవాలని ఓ వీడియో తీసి బంధువులకు పంపి సెల్‌ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసుకున్నారు. ఈ వీడియోను చూసిన వారి కుమారుడు కృష్ణసాయి తేజ్‌ దువ్వాడ పోలీస్‌ స్టేష¯Œ లో ఫిర్యాదు చేశారు.

Vizag
Varaprasad Meera

గాలిస్తున్న పోలీసులు..
కేసు నమోదు చేసిన దువ్వాడ పోలీసులు దంపతుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో అనకాపల్లి జిల్లాలోని ఏలేరు కాలువ దగ్గర దంపతుల బ్యాగు, దుస్తులు, చెప్పులు లభ్యమయ్యాయి. ప్రస్తుతానికి మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకు వాళ్లు ఎక్కడికైనా వెళ్లిపోయారా..? ఆత్మహత్య చేసుకున్నారా..? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Chennai Love Story Twitter Talk: ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్విటర్ టాక్ ఇదే..ఇలాంటి రెస్పాన్స్ అసలు ఊహించలేదు..

Chennai Love Story Twitter Talk: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ...

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...

Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

Chennai Love Story Movie Review: 'క' సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కే ర్యాంప్ సినిమాతో సైతం ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మరోసారి 'చెన్నై...

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Oktelugu Epaper
Exit mobile version