
Lungs Problem : మనం బతికి ఉన్నామని తెలిపేది మన శ్వాస. ఎప్పుడైతే శ్వాస ఆగిపోతుందే అప్పుడు మన చనిపోయినట్లు లెక్క. మన శ్వాసను నియంత్రించేవి ఊపరితిత్తులు. నిరంతరం మన లోపలకు ఆక్సిజన్ పంపించి మళ్లీ అది బయటకు వచ్చేలా చేసేవి ఊపిరితిత్తులే. అందుకే ఊపిరికి అంత ప్రాధాన్యం ఉంటుంది. ఊపిరితిత్తులకు కూడా కొన్ని సందర్భాల్లో జబ్బులు చేయడం సహజమే. అలాంటి సమయంలో మనకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. దీంతో మనం అప్రమత్తమై ఊపిరితిత్తుల సమస్యను దూరం చేసుకోవాలి. లేదంటే మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది.
మనలో చాలా మందికి సహజంగా దగ్గు, జలుబు వస్తుంటాయి. కానీ అవి పదేపదే వస్తుంటే అనుమానించాలి. నిమోనియా ఉందేమో పరీక్షలు చేయించుకోవాలి. ఈ లక్షణాలు కనిపిస్తే శ్వాసకోశ సమస్యలు వచ్చినట్లే అని గుర్తించాలి. తక్షణమే వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. లేదంటే మన ఊపిరిపై తీవ్ర ఒత్తిడి పెరిగి చివరకు ఎక్కడకో దారి తీస్తుంది. ఊపిరితిత్తులు సరిపడ ఆక్సిజన్ ను తీసుకునే శక్తి కలిగి ఉంటాయి. దీంతో మనక శ్వాసపరమైన ఇబ్బందులు కనిపించవు. ఒకవేళ ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తే కచ్చితంగా ఏదో సమస్య ఉందని అనుకోవాలి.
ఊపిరితిత్తుల్లో కణతి లేదా కార్మినామా నుంచి ద్రవం ఏర్పడటం వల్ల ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తుంటాయి. ఆకస్మికంగా బరువు తగ్గడం, ఎటువంటి పనులు చేయకుండానే శరీరం అలసిపోవడం లక్షణాలు కనిపిస్తే ముందే మేల్కోవాలి. మన శరీరంలో ఏదో సమస్య వచ్చినట్లు గుర్తించి తక్షణమే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకుని సమస్యను నయం చేసుకోవాలి. లేదంటే తీవ్రత పెరిగి ఊపిరితిత్తులు పాడయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాగైతే శ్వాస సంబంధమైన ప్రభావంతో మన ప్రాణాలకే ముప్పు ఏర్పడొచ్చు.

ఎక్కువ కాలం కఫంతో బాధపడుతుంటే కూడా జాగ్రత్త పడాలి. ఊపిరితిత్తులకు ఇబ్బందులు కలిగించే వాటిని దూరం చేసుకోవడమే ప్రధాన కర్తవ్యం. దీనికి బెల్ బ్రీతింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. దీని వల్ల పొత్తికడుపు కండరాలతో పాటు గుండె వేగాన్ని తగ్గించే రక్తపోటు కూా నియంత్రణలోకి వస్తుంది. మోకాళ్లు, తల అడుగున దిండ్లు ఉంచుకుని పడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా ఊపిరితిత్తుల పనితీరును ప్రభావితం చేసుకునే దిశగా పలు చిట్కాలు పాటించాలి.
రెండు సెకన్ల పాటు గాలి పీల్చుకుని వదిలేస్తూ మన కడుపు ఎలా అవుతుందో పరిశీలించుకోవాలి. నోటి ద్వారా నెమ్మదిగా ఊపిరి వదులుతూ కడుపులోని కండరాలు ఎలా కదులుతున్నాయో చూసుకోవాలి. గాలి బయటకు వదిలే క్రమంలో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకోవాలి. ఇలా శ్వాసకోశ సమస్యలు ఉన్నట్లయితే పలు మార్గాల్లో వ్యాయామాలు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.