Sheela Kaur: చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా మంది అమ్మాయిలు ఆ తరువాత పెద్ద హీరోయిన్ అవుతారని కలలుగంటారు. కానీ ఇలాంటి వారిలో కొంతమంది మాత్రమే గుర్తింపు పొందారు. మిగతావారు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఓ అమ్మాయి మాత్రం చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చి అలరించింది. పెద్దయ్యాక హీరోయిన్ గా రంగ ప్రవేశం చేసి అదరగొట్టింది. అతి తక్కువ సమయంలోనే ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల పక్కన నటించి మెప్పించింది. కెరీర్ మంచి పొజిషన్లో ఉండగా ఇక ఆమె స్టార్ అవుతానని అనుకుంది. కానీ హీరోయిన్ల పోటీ కారణంగా అవకాశాలు తగ్గడంతో మెల్ల మెల్లగా ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడు పూర్తిగా సినిమాలు మానేసి ఫ్యామిలీ లైఫ్ తో ఎంజాయ్ చేస్తోంది. లేటేస్టుగా ఆమె ఓ చిన్న పాపతో గుర్తుపట్టలేకుండా ఉన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈమె గురించి తెలియని వారు ఎవరబ్బా? అని చర్చించుకుంటున్నారు. మరి ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా?
షీలా కౌర్.. ఈ పేరు చాలా మందికి పరిచయం లేదు. కానీ ఆమెను చూస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. 1995లోనే చైల్డ్ ఆర్టిస్టుగా తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈమె. చిన్నప్పుడే పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఆ తరువాత స్టడీస్ పై ఫోకస్ చేసిన ఆమె పెరిగి పెద్దయ్యాక సినిమాల్లోకి ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ‘సీతాకోక చిలుక’ అనే సినిమాతో కెరీర్ స్ట్రాట్ చేసింది. ఆ తరువాత తొందర్లనే గుర్తింపు పొందిన ఈ భామ అల్లు అర్జున్ తో ‘పరుగు,’ ఎన్టీఆర్ తో ‘అదుర్స్’ సినిమాలో చేసి స్టార్ గా ఇమేజ్ తెచ్చుకుంది. దీంతో అమ్మడుకు అవకాశాలు తలుపుతట్టాయి.
హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలన్నింటిని ఉపయోగించుకున్న ఈమెకు ఇండస్ట్రీలో ఇతర హీరోయిన్ల నుంచి పోటీని ఎదుర్కొన్నారు. దీంతో ఈ భామను పట్టించుకునేవారు కరువయ్యారు. అయితే స్టార్ హీరో బాలకృష్ణ తో ‘పరమవీరచక్ర’ లో నటించడంతో మళ్లీ మంచి పొజిషన్ కు వెళ్తానని కలలు కంది. కానీ ఈ సినిమా యావరేజ్ హిట్టు కొట్టడంతో షీలాకు సినిమాల్లో చాన్సెస్ రాలేదు. ఇదే సమయంలో కరోనా రావడంతో ఆ భామ ఇక సినిమాల్లో నటించడం లాభం లేదనుకుందో ఏమో తెలియదు.. ఇక సినిమాలు వదిలి ఫ్యామిలీ లైఫ్ కు ప్రిఫరెన్ష్ ఇచ్చారు.
ఇదే సమయంలో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆమె కుటుంబానికే పరిమితం అయింది. ఈమెకు ఓ పాప పుట్టడంతో ఆమెతో తెగ ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబందించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. షీలా కౌర్ సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో తన పిక్స్ తో ఆకట్టుకుంటోంది. అయితే ప్రస్తుతం ఆమె గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. దీంతో ఆమె అప్పటికీ ఇప్పటికీ ఎంత మారిపోయిందో? అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.