https://oktelugu.com/

Raghava Lawrence: హీరో రాఘవ లారెన్స్ చేసిన పని తెలిస్తే శభాష్ అంటారు… ఇంత మంచోడివి ఏంటి సామీ!

Raghava Lawrence: కోట్ల సంపాదన ఉన్నా సమాజ హితం కోసం కొంత దానం చేయాలనే మనసు కొందరికే ఉంటుంది. చాలా మంది హీరోలు పలు మార్గాల్లో సామాజిక సేవ చేస్తున్నారు. సమాజం పట్ల తమ బాధ్యత నెరవేరుస్తున్నారు. వారిలో రాఘవ లారెన్స్ ఒకరు. ఈ మల్టీ టాలెంటెడ్ హీరో మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. 150 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకున్నారు. రాఘవ లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ తరపున ఈ పిల్లలకు మెరుగైన విద్య, […]

Written By:
  • Shiva
  • , Updated On : April 12, 2023 / 08:31 AM IST
    Follow us on

    Raghava Lawrence

    Raghava Lawrence: కోట్ల సంపాదన ఉన్నా సమాజ హితం కోసం కొంత దానం చేయాలనే మనసు కొందరికే ఉంటుంది. చాలా మంది హీరోలు పలు మార్గాల్లో సామాజిక సేవ చేస్తున్నారు. సమాజం పట్ల తమ బాధ్యత నెరవేరుస్తున్నారు. వారిలో రాఘవ లారెన్స్ ఒకరు. ఈ మల్టీ టాలెంటెడ్ హీరో మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. 150 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకున్నారు. రాఘవ లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ తరపున ఈ పిల్లలకు మెరుగైన విద్య, సదుపాయాలు అందించనున్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు.

    చాలా కాలంగా రాఘవ లారెన్స్ సామాజిక సేవ చేస్తున్నారు. 140 మంది చిన్నారులకు ఆయన హార్ట్ సర్జరీ చేయించారు. అనాధ, పేద విద్యార్థులను తన ట్రస్ట్ ద్వారా చదివిస్తున్నారు. తన సంపాదనలో కొంత మొత్తం రాఘవ లారెన్స్ సోషల్ సర్వీస్ కి ఖర్చు చేస్తున్నారు. రాఘవ లారెన్స్ ఈ విషయంలో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

    Raghava Lawrence

    లారెన్స్ లేటెస్ట్ మూవీ రుద్రన్. తెలుగులో ఈ మూవీ రుద్రుడు గా విడుదల అవుతుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ వేదిక మీద లారెన్స్ మాట్లాడారు. సేవ చేయడంలో ఆ రాఘవేంద్ర స్వామి నన్ను ముందుకు నడిపిస్తాడు. తెర మీదే కాదు నిజ జీవితంలో కూడా హీరోగా ఉండాలని మా అమ్మ చెప్పారు. ఆర్థిక సమస్యల కారణంగా ఎవరైనా చదువుకు దూరం అవుతున్నా, హార్ట్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉన్నా… రాఘవేంద్ర ఛారిటబుల్ ట్రస్ట్ ని సంప్రదించాలని ఆయన కోరారు.

    లారెన్స్ నటించిన రుద్రుడు మూవీ ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఇక గ్రూప్ డాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టిన లారెన్స్… అంచెలంచెలుగా ఎదిగాడు. నంబర్ వన్ కొరియోగ్రాఫర్ అయ్యాడు. స్టార్ కొరియోగ్రాఫర్ గా మంచి పొజిషన్ లో ఉన్న టైం లో దర్శకుడు అవతారం ఎత్తాడు. హీరో నాగార్జున ఆయనకు అవకాశం ఇచ్చారు. లారెన్స్ డైరెక్ట్ చేసిన మాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అలాగే నటుడిగా కాంచన సిరీస్ తో లారెన్స్ ఫేమస్ అయ్యాడు. లారెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా పని చేయడం విశేషం.