spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Security for Tomato : కేజీఎఫ్ లెవల్ లో టమాటాకు సెక్యూరిటీ.. ఆంధ్ర-కర్ణాటక బార్డర్ లో...

Security for Tomato : కేజీఎఫ్ లెవల్ లో టమాటాకు సెక్యూరిటీ.. ఆంధ్ర-కర్ణాటక బార్డర్ లో సీన్ చూస్తే గూస్ బాంబ్సే

Security for Tomato : కిలో టమాట పది పైసలు పలకని రోజులు చూశాం. రవాణా ఖర్చులు భరించలేక రోడ్డుపై పారబోసిన సందర్భాలను చూశాం.  కానీ ఇప్పుడు టమాటా బంగారమైపోయింది. దానిని కాపాడుకునేందుకు రైతులకు కష్టమైపోయింది. మార్కెట్ కు తీసుకెళ్లే లోపు ఎక్కడ దోపిడీ జరుగుతుందోనన్న భయం వెంటాడుతోంది. పొలంలో ఉన్న పంటను కాపాడుకోవడం రైతుకు ఎంతో భారంగా మారింది. కోసిన పంటను మార్కెట్ కు తరలించిన తరువాత భద్రపరచడం వ్యాపారికి ప్రాణసంకటంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే వర్షాలు ప్రారంభమైన నాటి నుంచి కూరల్లో తక్కువ, వార్తల్లో ఎక్కువ అన్నట్టు టమాటా పరిస్థితి ఉంది. టమాటాకు ఏకంగా హై సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తోంది.

ఆ మధ్యన వచ్చిన కేజీఎఫ్ సినిమా తరహాలో టమాటాకు హై సెక్యూరిటీ కల్పిస్తున్నారు. ఆంధ్రా, కర్నాటక సరిహద్దుల్లో టమాటా పండే పొలాల నుంచి పంటను విక్రయించే మార్కెట్ల వరకూ అన్నీ సెక్యూరిటీ జోన్లో ఉండడం విశేషం. పొలాల్లో పంటను రేయింబవళ్లూ రైతులు కాపలా కాస్తున్నారు. అటు మార్కెట్ల వద్ద రెండెంచల భద్రతను ఏర్పాటుచేయడం ఆకట్టుకుంటోంది. కోలార్ టమాటా ఫీల్డ్ గా మారిపోయాయి కుప్పం సరిహద్దు ప్రాంతాలు. రైతుల పరిస్థితి చూస్తుంటే మరీ ముచ్చటేస్తోంది. ఇంట్లో ఉన్న బంగారాన్ని కాపాడుకున్నట్టు పొలంలో ఉన్న టమాటా పంటను రక్షించుకుంటున్నారు. ఉదయం కోసిన పంటను మార్కెట్లకు భారీ భద్రత నడుమే తరలిస్తున్నారు.

టమాటాకు కోలార్ పెట్టింది పేరు. జాతీయ స్థాయిలో పేరు మోసిన మార్కెట్ ఇది. రోజుకు టన్నుల కొద్దీ పంటను వేలం వేసి విక్రయిస్తుంటారు. దేశ వ్యాప్తంగా ఉండే వ్యాపారులు ఇక్కడకు వచ్చి పంటను కొనుగోలు చేస్తుంటారు. కుప్పంతో పాటు కర్నాటక సరిహద్దులోని అన్ని ప్రాంతాల్లో టమాటా సాగు అధికం. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల కోసం ఇక్కడ నుంచే టమాటా ఉత్పత్తి జరుగుతోంది. దీంతో పొలంలో ఉన్న పంటను కాపాడుకునేందుకు రైతులు పాట్లు పడుతున్నారు. కుటుంబమంతా షిఫ్ట్ లు వేసుకొని రాత్రీ పగలూ కాపలా కాస్తున్నారు. రాత్రంతా టార్చ్ లైట్ వెలుగులతో పొలాలు కనిపిస్తున్నాయి. అటు కోలార్ మార్కెట్ లో సైతం నిఘా కొనసాగుతోంది. మార్కెట్ మొత్తం సీసీ కెమెరాలను నింపేశారు. పంట దిగిన నాటి నుంచి భద్రపరిచే వరకూ దృశ్యాలు కెమెరాల్లో నిక్షిప్తమవుతున్నాయి. అటు ఆంధ్రా, కర్నాటక సరిహద్దు ప్రాంతాల్లో రవాణా వ్యవస్థపై నిఘా కొనసాగుతోంది.

YouTube video player

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper
Exit mobile version