Vangalapudi Anita : ఈ మధ్యన రాజకీయాల్లో అస్సలు హుందాతనం అన్నది కనిపించడం లేదు. అటువంటిది ఆశించకూడదు కూడా. ఇప్పుడు మాటకు మాట.. బూతులు మాట్లాడితే కానీ స్ట్రాంగ్ అయిన, నికార్సయిన నాయకుడనిపించుకోలేరు. అధినేతకు ఆకర్షించలేరు. ప్రత్యర్థిపై ఎంతలా బూతులతో విరుచుకుపడితే అంత గుర్తింపు లభిస్తుంది. అయితే ఇటువంటి నేతల సరసన మహిళా నాయకురాళ్లు చేరుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరీ అంత బూతు ఏంటక్కా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
వలంటీరు వ్యవస్థపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం వేడెక్కిన సంగతి తెలిసిందే. దీనిపై అన్ని రాజకీయ పక్షాలు రియాక్టవుతున్నాయి. వైసీపీ చేస్తున్న యాగీ అంతాఇంతా కాదు. ఈ క్రమంలో ఓ పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలి హోదాలో వంగలపూడి అనిత స్పందించారు. తోటి మహిళా నాయకులతో పత్రిక సమావేశం పెట్టారు. అయితే పక్కనున్నది మహిళా నేతలే అయినా.. ఎదురుగా ఉన్న మీడియా ప్రతినిధుల్లో పురుషులే అధికం. వలంటీర్ల వ్యవస్థ విషయంలో తాను ఒకసారి పచ్చిపచ్చిగా మాట్లాడుతానని చెప్పిన అనిత బూతు పురాణం అందుకున్నారు. 60 సంవత్సరాల వృద్ధురాలు పెన్షన్ కావాలని కోరితే వలంటీరు పక్కలోకి రావాలని కోరుతున్నాడని చెప్పుకొచ్చారు. ఏదైనా పథకం కోసం వెళుతుంటే ‘నాకేంటి’ అన్న పదం ప్రయోగిస్తున్నారని చెప్పుకొచ్చారు,
రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలకు ఒక విధానముంటుంది. ఒక రకమైన పద ప్రయోగం చేయవచ్చు. కానీ వారి విమర్శలు చేస్తున్నారని.. తాము చేస్తున్న తప్పా అన్న రీతిలో నేతలు వ్యవహరిస్తున్నారు. ఈ తరహా ఆరోపణలు, వ్యాఖ్యలు చేయడంలో మంత్రి రోజా ముందుంటారు. నన్నెవరూ ఏం చేయ్యలేరంటూ ఆ మధ్యన ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. మొన్న ఆ మధ్యన ఎమ్మెల్సీ పోతుల సునీత అయితే చంద్రబాబు ఏకంగా సారా వ్యాపారమే చేస్తున్నారని ఆరోపించారు. భువనేశ్వరి, బ్రాహ్మణి కొట్టుకున్నారని కూడా చెప్పుకొచ్చారు. లోకేష్ కు మందు, మగువ లేకుండా ఉండలేరని విపరీత పద ప్రయోగం చేశారు. మందు తాగకుంటే చంద్రబాబు, లోకేష్ లకు నోరు పెగదలని కూడా ఆరోపణలు చేశారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా నేతలు హుందాతనాన్ని తగ్గించుకొని ప్రవర్తించడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.
పెన్షన్ తీసుకునేది 60 ఏళ్ల పైన ఉన్న వాళ్ళు
ఆ వృద్ధులను పట్టుకుని వాలంటీర్ వస్తావా అని అడిగారా??
సిగ్గుండాలి @Anitha_TDP ఆంటీ ఇలాంటి ఆరోపణలు చేయడానికి pic.twitter.com/BsM2VrQ5KO
— Suma Tiyyagura (Manvitha) (@SumaTiyyaguraa) July 14, 2023