
India Vs Australia: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్ లో టీమిండియా నాగపూర్ లో జరిగిన మొదటి టెస్టులో విజయం సాధించింది. దీంతో ఆత్మవిశ్వాసంతో ఢిల్లీ వేదికగా రెండో టెస్టు నేడు ఆడుతోంది. 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఆస్ట్రేలియాను మరోమారు దెబ్బతీయాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే టీంలో మార్పులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా బరిలోకి దిగింది. టీమిండియాలో ఒకే ఒక మార్పు చోటుచేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ కు స్థానం దక్కింది. అయ్యర్ జట్టులో చోటు సంపాదించాడు. ఆస్ట్రేలియా కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది.
ముగ్గురు స్పిన్నర్లతో..
ఈ మ్యాచ్ లో ముగ్గురు స్పిన్నర్లతో ఆస్ట్రేలియా ప్రయోగం చేస్తోంది. మ్యాట్ రెన్ షా స్థానంలో ట్రావిస్ హెడ్ జట్టులోకి తిరిగి రావడంతో బోలాండ్ స్థానంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ మ్యాథ్యూ కున్మెన్ జట్టులోకి రావడం గమనార్హం. మొదటి టెస్టులో ఇండియా అన్ని రంగాల్లో కంగారూలపై ఆధిపత్యం చెలాయించి మూడు రోజుల్లోనే ఆటపై పట్టు సాధించి ఆసీస్ ను పరాజయం అంచున నిలబెట్టింది. ఇక రెండో టెస్టులోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. మొదటి టెస్టులో రోహిత్ శర్మ సాధించిన సెంచరీ స్ఫూర్తితో టీమిండియాకు బలం చేకూరింది.
కేఎల్ రాహుల్ కు చివరి అవకాశం
మొదటి టెస్టులో రోహిత్, జడేజా, అక్షర్ పటేల్ ముగ్గురే రాణించారు. మిగతా వారు అంతగా ప్రాధాన్యం చూపకపోయినా బౌలర్ల ధాటికి ఆసీస్ కుప్పకూలింది. ప్రస్తుతం అయ్యర్ రాకతో జట్టు మంచి పటిష్ట స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో అయ్యర్ మంచి ఫామ్ లో కొనసాగుతుండటంతోనే అతడిని జట్టులోకి తీసుకున్నారు. కేఎల్ రాహుల్ కు ఇది చివరి అవకాశంగా చెబుతున్నారు. ఇందులో రాణించకపోతే అతడి భవితవ్యం అంధకారమే అని కామెంట్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ తన బ్యాట్ కు పని చెప్పాల్సిన అవసరం వచ్చింది.
వందో టెస్టు ఆడుతున్న..
చతేశ్వర్ పూజారాకి ఇది వందో టెస్టు. దీంతో అతడు కచ్చితంగా ఇందులో రాణించి మంచి దూకుడు ప్రదర్శించాలని చూస్తున్నాడు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ , విరాట్ కోహ్లి, రాహుల్ రాణిస్తే విజయం పెద్ద కష్టమేమీ కాదని చెబుతున్నారు. ఈ క్రమంలో మిడిలార్డర్ కూడా మంచి ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నారు. రెండో టెస్టులో విజయం సాధించాలంటే మన టీమిండియా మరోమారు విజయతీరాలు చేరాలని చూస్తోంది. ఇది సాధ్యం కావాలంటే అందరు సమష్టిగా రాణించి ప్రేక్షకుల అంచనాలు నిజం చేయాలని ఆకాంక్షిస్తున్నారు.

సీనియర్లు రాణిస్తే..
ఆస్ట్రేలియా కూడా ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతోంది. వార్నర్, స్మిత్, మార్నస్ అబుషేన్, ట్రావిసస్ హెడ్స్ లు కీలక ఆటగాళ్లుా ఉన్నారు. వీరు రాణించినట్లయితే ఇండియా శ్రమించక తప్పదు. భారత తుది జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), చతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (కీపర్, బ్యాటర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ , ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, పీటర్ హ్యాండ్స్, కోమ్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్, టాడ్ ముర్ఫీ, నాథన్ లయన్, మాథ్యూ కున్మెన్ ఉన్నారు.