సింగర్ సునీత నేడు రహస్యంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఓ మీడియా సంస్థ అధినేతను సునీత త్వరలో వివాహం చేసుకోనున్నారు. నేడు అత్యంత సన్నిహితుల మధ్య ఆర్భాటాలకు దూరంగా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. మొదటి భర్తతో విడిపోయిన సునీత చాలా కాలంగా ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే. Also Read: రూపాయి ఖర్చు లేదు కాబట్టే.. హనీమూన్ కి ఒప్పుకుందట ! సింగర్ సునీత అనగానే సంగీత ప్రియుల మదిలో ‘ఈ వేళలో నీవు… ఏం చేస్తూ ఉంటావో’ అనే పాట మెదులుతుంది. గులాబీ సినిమా కోసం […]
సింగర్ సునీత నేడు రహస్యంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఓ మీడియా సంస్థ అధినేతను సునీత త్వరలో వివాహం చేసుకోనున్నారు. నేడు అత్యంత సన్నిహితుల మధ్య ఆర్భాటాలకు దూరంగా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. మొదటి భర్తతో విడిపోయిన సునీత చాలా కాలంగా ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే.
Also Read: రూపాయి ఖర్చు లేదు కాబట్టే.. హనీమూన్ కి ఒప్పుకుందట !
సింగర్ సునీత అనగానే సంగీత ప్రియుల మదిలో ‘ఈ వేళలో నీవు… ఏం చేస్తూ ఉంటావో’ అనే పాట మెదులుతుంది. గులాబీ సినిమా కోసం సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ ఆ సాంగ్ ని కంపోజ్ చేశారు. సింగర్ గా వెండితెరపై సునీతకు అది మొదటి సాంగ్. ఆ పాట అప్పట్లో ఒక సంచలనం, యువతను ఊపేసిన ఆ సాంగ్ ని పాడిన సునీత మొదటి సాంగ్ తోనే విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆ పాట పాడే సమయానికి సింగర్ సునీత వయసు కేవలం 17ఏళ్ళు మాత్రమే.
Also Read: ప్రియమిత్రుడు కోసం కదిలివచ్చిన మెగాస్టార్ చిరు
పరిశ్రమకు పరిచయమైన రెండేళ్లకే సునీత ప్రేమ వివాహం చేసుకున్నారు. 19ఏళ్ల వయసులో మీడియాలో పనిచేసే కిరణ్ కుమార్ గోపరాజుని పెళ్లి చేసుకున్నారు. చాలా కాలం వీరి వివాహ బంధం సాపీగానే సాగింది. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి కూడా ఉన్నారు. ఐతే భర్త ప్రవర్తన వ్యసనాల కారణంగా సునీత కుటుంబం ఆర్థిక ఇబ్బందులపాలు చేసిందట. భర్త చేసిన అప్పుల కారణంగా కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందట. ఈ కారణం చేతనే సునీత, భర్తకు విడాకులు ఇచ్చారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి.
అలాగే సింగర్ సునీతపై వ్యభిచార ఆరోణపలు రావడం జరిగింది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా సునీత వ్యభిచారం చేశారంటూ కథనాలు రావడంతో, సునీత కొన్ని వేదికలపై దీనిపై స్పందించారు. అవన్నీ నిరాధారమైన ఆరోపణలని సునీత కన్నీరు పెట్టుకున్నారు. ఇక కొన్నాళ్లుగా సునీత రెండో వివాహం పై వార్తలు వస్తుండగా సునీత స్పందించలేదు. నేటితో ఈ విషయంపై స్పష్టత వచ్చింది. సునీత రెండవ వివాహం నిశ్చయం అయ్యింది. మీడియా కంట పడకుండా సునీత రహ్యసంగా ఈ ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ప్రస్తుతం సునీత వయసు 42ఏళ్ళు కావడం విశేషం.
మరిన్ని సినిమా వార్తల కోసం: సినిమా