https://oktelugu.com/

వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం.. కోనసీమకు శాపం..

నవరత్నాల పేరిట ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని జగన్ సర్కార్ ఊదరగొడుతోంది. ఎన్నికల్లో హామీనిచ్చిన దాదాపు 90శాతం  హామీలను నెరవేర్చామని చెబుతోంది. ప్రజాధనాన్ని జగన్ సర్కార్ ఇప్పటికే పప్పుబెల్లాల్లా పంచేసింది.. అప్పులు తెచ్చి మరీ పందేరం చేసింది. కానీ ఇప్పుడు అభివృద్ధి చేయడానికి.. ప్రజలకు కనీస మౌళిక సదుపాయాలు కల్పించడానికి రూపాయి లేక కేంద్రం నిధులు ఇస్తున్నా కనీస తోడ్పాటును అందించలేక చేతులెత్తిస్తోంది. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కేంద్రం నుంచి కూడా నిధులు రాక […]

Written By:
  • NARESH
  • , Updated On : December 7, 2020 / 01:46 PM IST
    Follow us on

    నవరత్నాల పేరిట ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని జగన్ సర్కార్ ఊదరగొడుతోంది. ఎన్నికల్లో హామీనిచ్చిన దాదాపు 90శాతం  హామీలను నెరవేర్చామని చెబుతోంది. ప్రజాధనాన్ని జగన్ సర్కార్ ఇప్పటికే పప్పుబెల్లాల్లా పంచేసింది.. అప్పులు తెచ్చి మరీ పందేరం చేసింది. కానీ ఇప్పుడు అభివృద్ధి చేయడానికి.. ప్రజలకు కనీస మౌళిక సదుపాయాలు కల్పించడానికి రూపాయి లేక కేంద్రం నిధులు ఇస్తున్నా కనీస తోడ్పాటును అందించలేక చేతులెత్తిస్తోంది. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కేంద్రం నుంచి కూడా నిధులు రాక అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయి. ఇది ప్రజలకు శాపంగా మారుతోంది.

    Also Read: చంద్రబాబుకు చుక్కలేనా? స్టీఫెన్ ను దించుతున్న జగన్?

    ఉభయగోదావరి జిల్లాలకు వైసీపీ ప్రభుత్వం నిర్ణయం శరాఘాతంగా మారింది. తూర్పు, పశ్చిమగోదావరిలను కలిపే కోనసీమ రైల్వే లైన్ పనులకు బ్రేక్ పడింది. తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లి- నరసాపురం రైల్వే పనులను తాత్కాలిక నిలిపివేతకు కేంద్ర రైల్వేశాఖ ఆదేశాలు ఇవ్వడం పెనుశాపంగా మారింది. .

    Also Read: వైసీపీలో వర్గ విభేదాలు.. కొట్టుకుంటున్న నేతలు

    రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల తాత్కాలికంగా రైల్వే పనులు ఆపేస్తున్నామని.. రైల్వే శాఖ చీఫ్ ఇంజనీర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం షాకింగ్ మారింది. దీన్ని బట్టి కనీస అభివృద్ధి పనులకు.. ప్రజలకు ఎంతో ఉపయోగపడే రైల్వే లైన్ పనులకు కూడా వైఎస్ జగన్ సర్కార్ నిధులను సమకూర్చడం లేదని.. దివాళా తీసిందన్న సంగతి వెలుగుచూసింది…

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    ఇదే కాదు.. గోదావరి జిల్లాల్లో కీలకమైన రహదారి పనులకు నిధులు లేక వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో గోదావరి నదిపై నిర్మిస్తున్న మూడు ప్రధాన వంతెన పనులు నిలిచిపోతున్నాయి. శానపల్లిలంక- కోటిపల్లి, బోడసకుర్రు – పాసర్లపూడి, చించినాడ – నరసాపురం మధ్యన నిర్మించ తలపెట్టిన వంతెన పనులకు సర్కార్ వద్ద నిధులు లేమి కారణంగా తాత్కాలికంగా బ్రేక్ పడ్డాయి. దీంతో జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు పంచి పెట్టడం కంటే ఇలా అందరికీ ఉపయోగపడే రహదారులు, రైల్వే లైన్లు పూర్తి చేయవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. పప్పూ బెల్లాలకే జగన్ సర్కార్ నిధులు సరిపోవని.. ఇంక మనకెందుకు ఇస్తారు నిధులని కోనసీమ వాసులు మండిపడుతున్నారు.