
రైతులు తలపెట్టిన రేపటి భారత్ బంద్‌కు మద్దతిస్తున్నట్లు డీఎంకే ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ ప్రకటించారు. భారత్ బంద్‌లో డీఎంకే నాయకత్వంతో పాటు కార్యకర్తలు పాల్గొని రైతులకు మద్దతుగా భారత్ బంద్‌లో పాల్గొంటామని ఆయన తెలిపారు. తమిళనాడులో కేంద్రం నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులను పోలీసులు అరెస్టు చేయడం దారుణమన్నారు. పళనిస్వామి ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఉందని స్టాలిన్ మండిపడ్డారు.