Human Embryo: సాధారణంగా ఒక జీవి ఏర్పడాలంటే వీర్యం అండంతో ఫలదీకరణం జరపాలి. అది పిండంగా ఏర్పడాలి. రకరకాల దశల తర్వాత అది ఒక జీవిగా మార్పు చెందుతుంది. గర్భావధి కాలం పూర్తి అయిన తర్వాత అది ఒక జీవిగా బయటకు వస్తుంది. ఇది అందరికీ తెలిసిన ప్రక్రియే. కానీ సైన్స్ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో అండం, వీర్యకణాల అవసరం లేకుండానే కృత్రిమంగా ప్రయోగశాలలో ఒక పిండాన్ని తయారు చేశారు. అది కూడా గర్భాశయంలో ఏర్పడిన మానవ పిండం ఎలా ఉంటుందో.. అచ్చం అలాంటి కృత్రిమ పిండాన్ని రూపొందించారు. ఇప్పుడు ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇంతకీ దీన్ని ఎలా తయారు చేశారు? తయారు చేయాల్సిన అవసరం ఏం వచ్చింది? తయారీదారుల వెనుక ఉద్దేశం ఏమిటి?
శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచ దేశాలకు సవాల్ విసిరే స్థాయిలో ఉన్న ఇజ్రాయల్ లో వెయిమన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనే పేరుతో ఒక సంస్థ ఉంది. ఇందులో నూతన ఆవిష్కరణలకు సంబంధించి రకరకాల ప్రయోగాలు జరుగుతుంటాయి. అయితే ఈ విషయాలను ఇజ్రాయిల్ పెద్దగా బయటకి చెప్పదు. ఇక్కడ జరుగుతున్న ఆవిష్కరణలను తన దేశానికి అనుకూలంగా మలుచుకుంటుంది. తన దేశ ప్రయోజనాల కోసం మాత్రమే వాడుకుంటుంది. అయితే ఈ ప్రయోగ కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు గత కొంతకాలం నుంచి తీవ్రమైన ప్రయోగాలు చేస్తున్నారు. వారి ప్రయోగం ఫలించింది. ఆ ప్రయోగంలో భాగంగా చివరికి కృత్రిమ పిండం అభివృద్ధి చెందింది. అయితే ఈ పిండాన్ని వారు అభివృద్ధి చేసేందుకు ముందు ఎలుకల మీద ప్రయోగాలు చేశారు. ఇక నుంచి సేకరించిన స్టెమ్ సెల్స్ ను ల్యాబ్ లోని కంటైనర్ లో భద్రపరిచారు. అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో తల్లి కడుపులో ఉండే వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అందులోని పోషక జలం ప్రభావంతో వీర్యకణాలు, అండాలు లేకుండానే స్టెమ్ సెల్స్ ఫలదీకరణం చెంది.. చివరికి అండం ఏర్పడింది. ఎలుకలపై చేసిన ప్రయోగం విజయవంతం కావడంతో ఇప్పుడు కృత్రిమంగా మానవ పిండాన్ని అభివృద్ధి చేశారు. ఈ కృత్రిమ పిండం నిర్మాణం పూర్తిగా మానవ పిండాన్ని పోలి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవ పిండంలో ఉన్నట్టుగానే ప్లాసెంటా, యోక్ సాక్, క్రోనిక్ సాక్, ఇతర కణజాలాలు ఉంటాయి. అంతేకాకుండా పిండం అభివృద్ధి కూడా తల్లి కడుపులో ఉన్నట్టుగానే ఉంది.
ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు తమ ప్రయోగంలో భాగంగా ముందు గా స్టెమ్ సెల్స్ ను నాలుగు రకాల కణాలుగా విడగొట్టారు. ఏపీ బ్లాస్ట్, హైపో బ్లాస్ట్, ఎక్స్ట్రా ఎంబ్రాయోనిక్ మెసొ డెర్మ్, ట్రోపో బ్లాస్ట్ నాలుగు రకాల కణాలుగా స్టెమ్ సెల్స్ ను వేరు చేశారు. ఈ నాలుగు రకాల కణాలను పలు రసాయనాల సహాయంతో నిర్ణీత నిష్పత్తిలో కలిపి ప్రయోగశాలలో అభివృద్ధి చేయడంతో అది కృత్రిమ పిండంగా అభివృద్ధి చెందింది. అప్పుడు ఏపీ బ్లాస్ట్ కణాలు పిండంగా అభివృద్ధి చెందాయి. పిండం అభివృద్ధి చెందేందుకు కావలసిన ఆక్సిజన్, న్యూట్రిషన్ అందించే ప్లాసెంటా గా ట్రోపో బ్లాస్ట్ సెల్స్ అభివృద్ధి చెందాయి. ఇక హైపో బ్లాస్ట్ కణాలు యోక్ సాక్ సపోర్టింగ్ గా ఉండగా.. ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ మెసొ డెర్మ్ పిండం నిర్మాణంలో సహాయపడ్డాయి.
కృత్రిమ పిండాన్ని అభివృద్ధి చేయడం వల్ల వైద్యరంగం, మెడిసిన్ తయారీలో విప్లవత్మక మార్పులు తీసుకురావచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. చాలా సందర్భాల్లో గర్భిణులపై క్లినికల్ ట్రయల్స్ ను అనుమతించరు. దీంతో మానవ గర్భాశయంలోని పిండం అభివృద్ధి చెందే సమయంలో ఏ మెడిసిన్ తీసుకుంటే ఎలాంటి ప్రభావం ఉంటుందని దానిపై స్పష్టత చాలా తక్కువగా ఉంది. కాబట్టి కృత్రిమ పిండాలు అభివృద్ధి చేయడం వల్ల వాటిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కృత్రిమ పిండం రోజులదేనని.. నెలలు నిండినా కొద్దీ అభివృద్ధి చెందడం మొదలవుతుందని ఈ ప్రయోగానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇలా ఏర్పడిన అవయవాలను అవసరం ఉన్న రోగులకు మార్పిడి చేయవచ్చని వారు చెబుతున్నారు.
WATCH: Scientists in Israel have created a model of a human embryo from stem cells in the laboratory, without using sperm, eggs or a womb, offering a unique glimpse into the early stages of embryonic development https://t.co/qixNzec2tF pic.twitter.com/unFSr4YNDm
— Reuters Asia (@ReutersAsia) September 8, 2023