https://oktelugu.com/

ఎస్బీఐని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణమేమిటంటే?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. ఎస్బీఐ సోషల్ మీడియాలో చేసిన ఒక ట్వీట్ ట్రోలింగ్ కు కారణమవుతోంది. ఎస్బీఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా 2020 సంవత్సరం లెక్కల ప్రకారం అమెరికా జనాభా 33.2 కోట్లుగా ఉంటే ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల సంఖ్య 44.89 కోట్లుగా ఉందని ఎస్బీఐ పేర్కొంది. 2019 – 2020 ఆన్యువల్ రిపోర్ట్ ఆధారంగా ఈ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 5, 2021 / 07:11 PM IST
    Follow us on

    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. ఎస్బీఐ సోషల్ మీడియాలో చేసిన ఒక ట్వీట్ ట్రోలింగ్ కు కారణమవుతోంది. ఎస్బీఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా 2020 సంవత్సరం లెక్కల ప్రకారం అమెరికా జనాభా 33.2 కోట్లుగా ఉంటే ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల సంఖ్య 44.89 కోట్లుగా ఉందని ఎస్బీఐ పేర్కొంది. 2019 – 2020 ఆన్యువల్ రిపోర్ట్ ఆధారంగా ఈ వివరాలను వెల్లడిస్తున్నారని ఎస్బీఐ పేర్కొంది.

    Also Read: మిస్డ్ కాల్‌తో బ్యంక్ బ్యాలన్స్ తెలుసుకునే అవకాశం.. ఎలా అంటే..?

    జియో అమెరికా జనాభా కంటే ఎస్బీఐ కస్టమర్లు ఎక్కువని ట్వీట్ చేయగా ఎస్బీఐ కూడా అదే విధంగా ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ను చూసిన ఎస్బీఐ కస్టమర్లు తమకు ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ లలో ఎదురైన చేదు అనుభవాలను, సిబ్బంది ప్రవర్తనను, ఎస్బీఐ అకౌంట్ ద్వారా లావాదేవీలు జరిపిన సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను పేర్కొన్నారు. ఎస్బీఐ పనితీరు గురించి నెటిజన్లు సెటైర్లు వేస్తుండటం గమనార్హం.

    Also Read: క్రెడిట్, డెబిట్ కార్డులు వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్.. వివరాలు లీక్..?

    అన్ని కోట్ల మంది కస్టమర్లు ఎస్బీఐ కస్టమర్లకు మెరుగైన సేవలను అందించలేకపోతుందంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఎస్బీఐ నెటిజన్లు ఫైరైన నేపథ్యంలో ఇకముందైనా ట్వీట్లు చేసే సమయంలో జాగ్రత్త వహించాల్సి ఉంది. మరోవైపు ఎస్బీఐ ఖాతాదారులు మోసగాళ్ల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. సోషల్ మీడియాలో వచ్చే మోసపూరిత సందేశాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ సూచించింది.

    మరిన్ని వార్తల కోసం: వైరల్ వార్తలు

    దేశంలో సైబర్ మోసాలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఎస్బీఐ ఖాతాదారులను సోషల్ మీడియా ద్వారా అలర్ట్ చేస్తోంది. మోసగాళ్ల, తప్పుదోవ పట్టించే సందేశాల బారిన పడవద్దని సూచనలు చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.