గుడ్లు, చికెన్ తింటే బర్డ్ ఫ్లూ బారిన పడతామా.. వాస్తవమేమిటంటే..?

దేశంలో కరోనా కేసులు తగ్గి ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తుండగా బర్డ్ ఫ్లూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలో వేల సంఖ్యలో పక్షులు బర్డ్ ఫ్లూ బారిన పడి మృతి చెందాయి. ఏవియన్ ఇంఫ్లుయెంజా పేరుతో బర్డ్ ఫ్లూకు కారణమయ్యే వైరస్ మనుషులకు, జంతువులకు కూడా సోకగలదని అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాదాపు 23 సంవత్సరాల క్రితం తొలిసారి ఈ వైరస్ ను గుర్తించారు. Also Read: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన […]

Written By: Navya, Updated On : January 6, 2021 11:10 am
Follow us on

దేశంలో కరోనా కేసులు తగ్గి ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తుండగా బర్డ్ ఫ్లూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలో వేల సంఖ్యలో పక్షులు బర్డ్ ఫ్లూ బారిన పడి మృతి చెందాయి. ఏవియన్ ఇంఫ్లుయెంజా పేరుతో బర్డ్ ఫ్లూకు కారణమయ్యే వైరస్ మనుషులకు, జంతువులకు కూడా సోకగలదని అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాదాపు 23 సంవత్సరాల క్రితం తొలిసారి ఈ వైరస్ ను గుర్తించారు.

Also Read: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలివే..?

అప్పట్లో సరైన వైద్య చికిత్సలు లేకపోవడంతో బర్డ్ ఫ్లూ బారిన పడిన వారిలో సగం కంటే ఎక్కువ మంది మృతి చెందారు. ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి సోకనప్పటికీ వైరస్ ల వల్ల ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. 1991 సంవత్సరంలో హాంగ్ కాంగ్ లో తొలిసారి శాస్త్రవేత్తలు ఈ వైరస్ ను గుర్తించారు. జ్వరం, దగ్గు, తలనొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు, గొంతునొప్పి, కండరాల నొప్పులు, డయేరియా బర్డ్
ఫ్లూ బారిన పడిన వారిలో కనిపిస్తాయి.

Also Read: దంతాలు పుచ్చిపోకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?

గుడ్లు, చికెన్ తీసుకుంటే బర్డ్ ఫ్లూ సోకుతుందా అంటే పూర్తిగా ఉడికిన గుడ్లు, చికెన్ తీసుకుంటే బర్డ్ ఫ్లూ బారిన పడే అవకాశం ఉండదు. చెస్ట్ ఎక్స్ రే, వైట్ బ్లడ్ షెల్ డిఫరెన్షియల్ పరీక్షల ద్వారా బర్డ్ ఫ్లూ బారిన పడే అవకాశం ఉంటుంది. తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బర్డ్ ఫ్లూ బారిన పడకుండా మనల్ని మనం సులభంగా రక్షించుకోవచ్చు.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

ఇన్ ఫెక్షన్ సోకిన పక్షులకు దూరంగా ఉండటం, ఉడికీ ఉడకని మాంసం, గుడ్లు తినకుండా ఉండటం ద్వారా బర్డ్ ఫ్లూ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ద్వారా బర్డ్ ఫ్లూ బారిన పడినా లక్షణాలు ఎక్కువ కాకముందే చికిత్స తీసుకుని కోలుకోవచ్చు.