Homeట్రెండింగ్ న్యూస్KTR - Brahamanandam: కేటీఆర్‌.. బ్రహ్మీ.. సోషల్‌ మీడియాలో ఆడేసుకుంటున్నారు

KTR – Brahamanandam: కేటీఆర్‌.. బ్రహ్మీ.. సోషల్‌ మీడియాలో ఆడేసుకుంటున్నారు

KTR – Brahamanandam: అధికారం పోయినా.. అదే అహంకారం ప్రదర్శిస్తున్నారు తెలంగాణ మాజీ ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, మరో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతను భుజానికెత్తుకుని రాష్ట్రమంతా తిరిగారు. హెలిక్యాప్టర్‌లో ఏ పార్టీ చేయనంత ప్రచారం చేశారు. కానీ వారి అహంకారం, అవినీతి, కబ్జాలు, దౌర్జన్యాలతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు సాలు దొర అన్నట్లుగా ఇంటికి పంపించారు. పార్టీకి ఎన్నికల్లో సారథ్యం వహించిన ఈ బావ, బామ్మర్ధులు తమ వైఫల్యాన్ని మాత్రం అస్సలు ఒప్పుకోవడం లేదు. ఓటమిని అంగీకరిస్తే తమ వైఫల్యాన్ని అంగీకరించినట్లు అవుతుందన్న భావనలో బీఆర్‌ఎస్‌ ఓటమికి కూడా కాంగ్రెస్‌ తప్పుడు హామీలు కారణమని ప్రచారం మొదలు పెట్టారు. కానీ, అసలు విషయం జనానికి తెలుసు. ఎన్నికల్లో ఓడినా కూడా అదే దొరతనం.. అవే అహంకారం ప్రదర్శిస్తున్నారు. ప్రజలు మెచ్చేలా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన నేతలు.. అధికార పక్షంపై ఎదురుదాడి మొదలు పెట్టారు. కాంగ్రెస్‌ కొలువుదీరి రెండు నెలలు కూడా గడవక ముందే.. దొంగ హామీలు.. అమలు చేయరు.. రుణమాఫీ ఎప్పుడు, రైతుబంధు ఏమైంది.. కరెంటు బిల్లు కట్టొద్దు, సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్లు ఎప్పుడు ఇస్తరు అంటూ పదేపదే ప్రశ్నిస్తున్నారు. నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన నాయకులు నియంతలా మాట్లాడుతున్నారు. కేటీఆర్‌ అయితే ఓ అడుగు ముందుకేసి హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్‌ నాయకులను పంచలు ఊడేలా కొడతామని హెచ్చరించారు. నోటికి ఎంత వస్తే అంత మాట అనేస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్‌ను ఎవరైనా అంటే ముఖ్యమంత్రి అన్న గౌరవం కూడా లేకుండా మాట్లాడుతున్నారని పదేపదే ఆవేదన చెందే రామారావు.. రేవంత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు కూడా కాకముందే ఆయనను శునకంతో పోలుస్తూ ట్వీట్‌ కూడా చేశారు. మనది సోమవారం.. మందిది మంగళవారం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కేటీఆర్‌. దీంతో ఆయనను నెటిజన్లు ఆటాడుకుంటున్నారు.

బ్రహ్మీతారక్‌ అంటూ..
సోషల్‌ మీడియా వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్న కేటీఆర్‌ను ఇప్పుడు నెటిజన్లే ఓ ఆటాడుకుంటున్నారు. హాస్య నటుడు బ్రహ్మానందం, కేటీఆర్‌ ఫొటోలను కలిపి మార్ఫింగ్‌ చేసి బ్రహ్మీతారక్‌ అంటూ ఆయన ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. సడెన్‌గా చూస్తే ఈ ఫొటో బ్రహ్మానందం లాగానే కనిపిస్తుంది. కానీ పరిశీలించి చూస్తే అందులో కేటీ.రామారావు స్పష్టంగా కనిపిస్తారు. కేటీఆర్‌ను కూడా ఓ కమెడియన్‌ పొలిటీషియన్‌గా చిత్రీకరించే ప్రయత్నంలో దీనిని ఎడిట్‌ చేసి పోస్టు చేశారు. సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన గంట వ్యవధిలోనే దీనిని పది వేల మందికి పైగా వీక్షించారు.

కామెంట్ల వెల్లువ..
ఇక ఈ బ్రహ్మీతారక్‌ ఫొటో చూసిన నెటిజన్లంతా స్పందిస్తున్నారు. కామెంట్లు పెడుతున్నారు. డ్రామారావు, బ్రహ్మీరామారావు, దొంగ బ్రహ్మీ, కామెడీ రామారావు. దొర బ్రహ్మానందారావు, ఎడిటింగ్‌ సూపర్‌ బ్రో.. నెక్ట్‌ పొలిటికల్‌ కమెడియన్‌. అప్‌కమింగ్‌ కేఏ.పాల్‌.. కేటీ.రామారావు అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ సోషల్‌ మీడియా ప్రతినిధులు దీనిని తెగ వైరల్‌ చేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version