Saraswati Bhati: ప్యాడ్ మన్(pad man) సినిమా చూశారా.. అందులో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఆడవాళ్లు అత్యంత సులువుగా నెలసరి సమయంలో దరిచే విధంగా ప్యాడ్స్ రూపొందించడానికి చాలా కష్టపడతాడు. ఆ సినిమా చూస్తున్నంత సేపు.. ఆడవాళ్లు ఆ మూడు రోజుల్లో పడే కష్టం కళ్ళ ముందు కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అయితే కంటనీరు ధారాళంగా కారుతూ ఉంటుంది.
అలాంటి సినిమా కాబట్టి.. దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు కాబట్టి.. కాస్త భావోద్వేగంగా ఉంటుంది. కానీ అదే నిజ జీవితంలో అయితే.. అలాంటి సంఘటనే సరస్వతి భాటి(Saraswati Bhati) అనే మహిళ జీవితంలో చోటుచేసుకుంది. దరిద్ర్యానికి.. పేదరికానికి.. నిరక్షరాస్యతకు చిరునామాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పేరుపొందింది. అనాదికాలంగా ఇక్కడ పేదరికం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ప్రభుత్వాలు మారినా పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. అయితే ఇక్కడ పేద కుటుంబాల్లో ఆడవాళ్లకు ఆ మూడు రోజులు కూడా సరైన ప్యాడ్స్ లభించవు. దీంతో మహిళలు తమ పాత చీరలు లేదా ఇతర వస్త్రాలనే ప్యాడ్స్ గా వాడుతుంటారు. వాటి వల్ల అనారోగ్య సమస్యల బారిన కూడా పడుతుంటారు. ఏళ్లుగా ఇదే జరుగుతున్నా ఆ మహిళల జీవితంలో పెద్దగా మార్పులు రావడం లేదు. అయితే ఈ బాధ్యతను సరస్వతి భాటి తీసుకున్నారు. అలాగని ఆమె ఏదో ఎన్జీవో సంస్థకు అధిపతో, లేక పేరుపొందిన రాజకీయ నాయకురాలో కాదు.
ఇంతకీ ఏం చేసిందంటే..
సరస్వతి భాటి ది పెద్దగా స్థితివంతమైన కుటుంబం కాదు. ఆమె 10 వరకే చదువుకుంది. పదవ తరగతిలో ఫెయిల్ కావడంతో కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి చేశారు. 16 సంవత్సరాలకే ఆమెకు వివాహం జరిగింది. ఆ తర్వాత ముగ్గురు పిల్లలకు తల్లి అయింది. ముగ్గురు పిల్లలకు తల్లి అయినప్పటికీ సరస్వతికి ఏదో సాధించాలనే కోరిక మెండుగా ఉండేది. ఈ క్రమంలోనే ఆమె మహిళలు ధరించే నాప్కిన్స్ ను తక్కువ ధరలో తయారు చేయాలని నిర్ణయించుకుంది. మార్కెట్లో సానిటరీ నాప్కిన్స్ కు ధర అధికంగా ఉంటుంది. పైగా ఆమె ఉండే ప్రాంతంలో మహిళలు అంత ఖర్చు పెట్టుకునే సామర్థ్యం ఉండదు. అందువల్లే వారి కోసం ఆమె స్వయం సహాయక బృందం సభ్యులతో కలిసి ప్యాడ్స్ తయారీ మొదలుపెట్టింది. మొదట్లో ప్యాడ్స్ కు అంతగా ఆదరణ ఉండేది కాదు. వాటిని కొనుగోలు చేయడానికి మహిళలు అంతగా ముందుకు వచ్చేవారు కాదు. అయితే సరస్వతి స్వయం సహాయక బృందం సభ్యులతో కలిసి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించేది. దీంతో వారు ప్యాడ్స్ కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చేవారు. బయటి మార్కెట్లో చిన్న ప్యాకెట్ ధర 45 రూపాయలు ఉండగా.. సరస్వతి ఆధ్వర్యంలో తయారుచేస్తున్న ప్యాకెట్ ధర 28 రూపాయలు మాత్రమే ఉండడం విశేషం. పైగా వీటిని సహజ సిద్ధమైన పదార్థాలతో తయారు చేయడం వల్ల మహిళల్లో ఎటువంటి రాషెస్ రావడం లేదు. దీంతో మహిళలు వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. పదో తరగతి ఫెయిల్ అయి.. 16 సంవత్సరాలకే పెళ్లి చేసుకుని.. ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యానని ఎక్కడా నిరాశ చెందకుండా.. సరస్వతి తన జీవిత తానే ప్రయోగం చేసుకుంది. మహిళల కనీస అవసరాన్ని వ్యాపార వస్తువుగా మలచుకుంది. చివరికి అందులో విజయం సాధించి.. ప్యాడ్ ఉమెన్ గా పేరుపొందింది.
యూపీ లోని సరస్వతి బాటి 10లో ఫెయిల్ అయ్యారు. 16 ఏళ్లకే పెళ్లి చేసుకున్నారు. ముగ్గురు పిల్లలకు తల్లి కూడా అయ్యారు.. స్వయం సహాయక బృందాలతో కలిసి అతి తక్కువ ధరకే మహిళలకు సానిటరీ నాప్కిన్స్ అందిస్తున్నారు. నెలకు 30K వరకు సంపాదిస్తున్నారు. #UttarPradesh #SaraswatiBhati pic.twitter.com/zh6JFXBd4I
— Anabothula Bhaskar (@AnabothulaB) January 26, 2025