Sara Tendulkar Engaged: గిల్, సారా రిలేషన్ లో ఉన్నారు.. వారిద్దరూ మీడియా కంట పడకుండా చాటుగా కలుస్తున్నారు. అతడు ఆడే మ్యాచ్లకు ఆమె హాజరవుతోంది. అతడిని ఎంకరేజ్ చేస్తోంది. అతడు కూడా ఆమె వస్తున్న తీరు చూసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.. ఇటీవల ఇంగ్లాండులో పరస్పరం తారసపడ్డారు. ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా చూపులతో మాట్లాడుకున్నారు. వారిద్దరు ప్రేమలో ఉన్నారు.. త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారు.. ఇలానే సాగుతోంది కొంతకాలంగా మీడియాలో ప్రచారం. నిజానికి వారిద్దరి మధ్య బంధం ఉన్నట్టు అధికారికంగా ప్రకటించలేదు. పరోక్షంగా వెల్లడించలేదు. ఇటీవల కాలంలో ఇంటర్వ్యూలో గిల్ సారా పేరు ప్రస్తావించకుండానే తాను ఎవరితోనూ ప్రేమలో లేనని.. ప్రస్తుతానికి ఆటను మాత్రమే ప్రేమిస్తున్నానని స్పష్టం చేశాడు. దీంతో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.
Also Read: ‘బిగ్ బాస్ 9’ లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టబోతున్న 6 మంది సెలబ్రిటీలు వీళ్ళే!
అందరూ అనుకున్నట్టు గిల్, సారా మధ్య ఏమీ లేదు.. దానిని రుజువు చేసే సంఘటన జరిగింది. సారా గోవా రెస్టారెంట్ ఓనర్ సిద్ధార్థ్ కేర్కర్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటికి వచ్చాయి. వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయిందని.. జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గతంలో వీరిద్దరూ దిగిన ఫోటోలను కూడా జాతీయ మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది. అయితే దీనిపై సచిన్ కుటుంబం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కేర్కర్ కూడా స్పందించలేదు. ఇక ఇటీవల సచిన్ కూతురు వ్యాపారం లోకి ప్రవేశించింది. అధునాతన జిమ్ ఏర్పాటు చేసింది. సారా సోదరుడు అర్జున్ ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే అతడికి వివాహం జరగనుంది.
సారా ఎంగేజ్మెంట్ చేసుకుంది కాబట్టే అత్యంత చనువుగా ఫోటోలు దిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. సారా ఇటీవల సిద్ధాంత్ చతుర్వేదితో డేటింగ్ చేస్తున్నట్టు గుసగుసలు వినిపించాయి. అయితే అదంతా నిజం కాదని తర్వాత తేలింది. ఇప్పుడు కేర్కర్ విషయంలో కూడా అదే జరుగుతుందని మరి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వ్యవహారం గురించి నిజం తెలియాలంటే సచిన్ కుటుంబం స్పందించాలి. అప్పుడుగాని అసలు వాస్తవం తెలుస్తుంది. అప్పటిదాకా ఈ ఊహగానాలకు… ఈ గుసగుసలకు అడ్డూ అదుపు ఉండదు.